ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: పందేలు లేని పేకాట తప్పుకాదు

ABN, Publish Date - May 26 , 2025 | 01:58 AM

సుప్రీం కోర్టు ప్రకారం, వినోదం కోసం పేకాట ఆడటం నైతిక ఉల్లంఘన కిందకు రావడం లేదని పేర్కొంది. హనుమంతరాయప్ప ఎన్నిక రద్దును తప్పుపడుతూ, ఆయన ఎన్నికను పునరుద్ధరించాలన్న తీర్పు ఇచ్చింది.

వినోదం కోసం ఆడటం నైతిక ఉల్లంఘన కాదు

కర్ణాటక వ్యక్తి కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మే 25: పందేలు, జూదం మాట లేకుండా వినోదం, విలాసం కోసం పేకాట ఆడటం తప్పుకాదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇది నైతిక ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది. కర్ణాటకలో ప్రభుత్వ పింగాణి ఫ్యాక్టరీ ఉద్యోగుల హౌసింగ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ బోర్డు డైరెక్టర్‌ వైసీ హనుమంతరాయప్ప కేసులో జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌ కోటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హనుమంతరాయప్పతో పాటు కొందరు రోడ్డు పక్కన కూర్చుని పేకాడ ఆడుతుండగా, ఎటువంటి విచారణ లేకుండా రూ.200 జరిమానా వేశారని పేర్కొంది. కాగా హౌసింగ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఎన్నికల్లో హనుమంతరాయప్ప చేతిలో ఓడిపోయిన రఘునాథ్‌ సహకార సంఘాల జాయింట్‌ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసి, గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌లో శిక్షార్హుడు అయినందున ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీంతో ఆయన ఎన్నికను రద్దు చేశారు. దీనిపై హనుమంతరాయప్ప కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా, ఎన్నిక రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. దీనిపై సుప్రీం కోర్టులో ఆయన సవాల్‌ చేశారు. సుప్రీం కోర్టు ధర్మాసనం ఇటీవల ఈ కేసును విచారించి తీర్పును వెలువరించింది. ‘ప్లే కార్డులకు చాలా రూపాలు ఉన్నాయి. ప్రతి ఆటలోనూ ముఖ్యంగా వినోదం కోసం ఆడినపుడు నైతిక ఉల్లంఘన జరిగిందని అంగీకరించలేం. మన దేశంలో చాలా ప్రాంతాల్లో పందేలు, జూదం ప్రస్తావన లేకుండా సాధారణంగా కార్డులు ఆడటం పేదవాడి వినోద వనరుగా భావిస్తారు’ అని ధర్మాసనం పేర్కొంది. హనుమంతరాయప్ప పందేలు ఆడే అలవాటున్న జూదగాడు కాదని పేర్కొంటూ, పేకాట ఆడారనే కారణంతో ఆయన ఎన్నికను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించలేమని, ఆయన ఎన్నికను పునరుద్ధరించాలని ఆదేశించింది.


ఇవి కూడా చదవండి

Minister Satyakumar: 2047 నాటికి ప్ర‌పంచంలో రెండో స్థానానికి భార‌త్ ఎద‌గ‌డం ఖాయం

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్‌, దాని నీచమైన నిర్వాహకుడు పాక్‌.. నిప్పులు చెరిగిన అభిషేక్

India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 01:58 AM