Narnedra Modi:Narnedra Modi: 'శీష్ మహల్' ఆప్ మోసాలకు నిలువుటద్దం: మోదీ
ABN, Publish Date - Jan 22 , 2025 | 08:17 PM
ఢిల్లీలో చాలా చోట్ల ఓడిపోతున్నామని గ్రహించినందువల్లే ఆప్ రోజుకో వాగ్దానం చేస్తోందని, పూర్వాంచల్ ప్రజలను ఢిల్లీ నుంచి పంపించేసేందుకు కుట్ర పన్నుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
న్యూఢిల్లీ: ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన ఆప్ ఆద్మీ పార్టీ (AAP) రోజుకో హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేజ్రీవాల్ తన కోసం కోట్లు వెచ్చించి 'శీష్ మహల్' నిర్మించుకుకున్నారని, ఆప్ మోసాలు, నయవంచనకు ఇదే నిదర్శనమని చెప్పారు. బీజేపీ కార్యకర్తలతో 'ఆన్‌లైన్' ముఖాముఖీలో మోదీ బుధవారంనాడు మాట్లాడుతూ, ఆప్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని ఓటర్లు కోపంతో ఉన్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి బూత్ నుంచి 50 శాతం ఓట్లతో బీజేపీ విజయం సాధించేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. 'ఆప్' విపత్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
AAP Health Scam: ఆప్ హెల్త్ స్కామ్, రూ.382 కోట్ల అవినీతి: కాంగ్రెస్
ఢిల్లీలో చాలా చోట్ల ఓడిపోతున్నామని గ్రహించినందువల్లే ఆప్ రోజుకో వాగ్దానం చేస్తోందని, పూర్వాంచల్ ప్రజలను ఢిల్లీ నుంచి పంపించేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆప్, కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల గత 25 ఏళ్లుగా ఢిల్లీ ప్రజలు మోసపోతున్నారని అన్నారు. ఆప్‌ను సాగనంపడటం వల్ల అభివృద్ధి భారతంలో అభివృద్ధి చెందిన ఢిల్లీ కలను సాకారం చేసేందుకు మార్గం సుగమమవుతుందని చెప్పారు.
లిక్కర్ దొరుకుతుంది కానీ...
ఢిల్లీ ప్రభుత్వం కనీస అవసరాలైన నీళ్లును కూడా అందించలోకపోతోందని ప్రధాని అన్నారు. ''లిక్కర్ దొరుకుంది కానీ నీళ్లు దొరకవు'' అని వ్యాఖ్యానించారు. బీజేపీని ఎన్నుకుంటే ఇంటింటికి తాగునీరు సౌకర్యం కల్పిస్తామనే భరోసాను కార్యకర్తలు ప్రజలకు చేరవేయాలని కోరారు. దయనీయమైన రోడ్లు, డ్రైనేజీ, అపరిశుభ్రతతో ఢిల్లీ ప్రజలు పడుతున్న అవస్థలు, ఈ దిశగా ఆప్ వైఫల్యాన్ని ఎండగట్టాలని అన్నారు. విద్యుత్ బిల్లులు పెరగడానికి కూడా ఆప్ ప్రభుత్వమే కారణమన్నారు. యుమునా నదీ ప్రక్షాళలను వాగ్దానం చేసి విఫలమైన ఆప్ ఇప్పుడు కొత్త వాగ్దానాలిస్తోందని, పేదలకు ఇళ్లు కట్టిస్తామని విఫలమైందని, కేంద్రం పేదల కోసం వేలాది ఇళ్లు కట్టించిందని చెప్పారు. మధ్యతరగతి ప్రజానీకం స్థితిగతుల మెరుగుకు బీజేపీ కట్టుబడి ఉందని, మెట్రో, హైవేల నిర్మాణానికి భారీగా ఖర్చు చేసిందని చెప్పారు. లక్షలాది మంది ఢిల్లీ ప్రజలతో సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఫేట్‌ను 8వ పే కమిషన్ మారుస్తుందని భరోసా ఇచ్చారు.
ఇది కూడా చదవండి..
Delhi Assembly Elections: ఆప్ మధ్యతరగతి మేనిఫెస్టో
State Govt: సొంతంగా విమానం కొనుగోలు చేయడం లేదు
influential Indians : సత్యం.. సుందరం!
Read More National News and Latest Telugu News
Updated Date - Jan 22 , 2025 | 08:17 PM