National Security: అటారీ-వాఘా సరిహద్దును మరోసారి తెరిచిన పాక్
ABN, Publish Date - May 03 , 2025 | 04:46 AM
పాకిస్థాన్ శుక్రవారం అటారీ-వాఘా సరిహద్దును తిరిగి తెరిచింది, భారత్ నుంచి వెళ్లిపోవాల్సిన 71 మంది పాక్ జాతీయులకు అనుమతి ఇచ్చింది. భారత్ విధించిన గడువు ఏప్రిల్ 30 తర్వాత నిరవధికంగా పొడిగించింది.
శ్రీనగర్, మే 2: అటారీ-వాఘా సరిహద్దును బుధవారం మూసేసిన పాకిస్థాన్ శుక్రవారం మరోసారి తెరిచింది. భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లిపోయేందుకు చెక్‌పోస్ట్ వద్ద వేచి ఉన్న తమ జాతీయులను తిరిగి అనుమతిస్తోంది. మొత్తం 71 మంది పాక్ జాతీయులు చెక్‌పోస్ట్ వద్ద ఎదురుచూస్తున్నారు. భారత్ విధించిన గడువు ఏప్రిల్ 30 నాటికి మొత్తం 911 మంది పాకిస్థానీలు భారత్ వీడారు. అయితే భారత్ ఆ గడువును నిరవధికంగా పొడిగించింది.
ఇవి కూడా చదవండి..
Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట
Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..
Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు
Updated Date - May 03 , 2025 | 04:47 AM