Adampur Airbase: అబద్ధాల ఫ్యాక్టరీ.. పాకిస్థాన్
ABN, Publish Date - May 14 , 2025 | 06:02 AM
ఆపరేషన్ సిందూర్‌పై పాక్ అబద్ధాల వర్షం కురిపించింది. ప్రధాని మోదీ స్వయంగా అదంపూర్ బేస్ సందర్శించి నిజం బహిర్గతం చేశారు.
‘ఆపరేషన్ సిందూర్’పై తప్పుడు సమాచారం.. పాక్ ఆర్మీ అధికారుల నోట అబద్ధాలే అబద్ధాలు
అదంపూర్ స్థావరం నాశనం అంటూ ఫొటోలు
అదంతా అబద్ధమని తేల్చిన ప్రధాని నరేంద్ర మోదీ
ఇతర ఎయిర్‌బేస్‌లపైనా పాక్ తప్పుడు ప్రచారం
(సెంట్రల్ డెస్క్)
నోరు తెరిస్తే అబద్ధాలు..! తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నాలు..! నిజం గడప దాటేలోపు.. అబద్ధాన్ని విశ్వవ్యాప్తం చేయడం..! ఈ జాతీయాలన్నీ దాయాదీ దేశం పాకిస్థాన్‌కు అచ్చంగా నప్పుతున్నాయి. గతంలోనే కాదు.. ‘ఆపరేషన్ సిందూర్’పైనా పాకిస్థాన్ అసత్యాలను ప్రచారం చేసింది. అవన్నీ అబద్ధాలేనని భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)తోపాటు.. ఫ్యాక్ట్‌చెక్కర్లు తేల్చిచెప్పారు. తాము భారత్‌కు చెందిన 20 వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని, దాంతో భారత్ కాల్పుల విరమణకు ప్రతిపాదించిందని స్వయానా పాక్ ఆర్మీకి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎ్‌సపీఆర్) డీజీ పేర్కొన్నారు. తమ దాడుల్లో అదంపూర్ ఎయిర్‌బేస్ రన్‌వే ధ్వంసమైందని, ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేశామని చెప్పారు. ప్రధాని మోదీ మంగళవారం స్వయంగా అదంపూర్ ఎయిర్‌బేస్ వెళ్లి.. రన్‌వేపై సైనికులతో మాట్లాడారు. ఆ వెనకాలే ఎస్-400 వ్యవస్థ కనిపించింది. ఈ నేపథ్యంలో.. పాక్ అబద్ధాలపై ప్రత్యేక కథనం..
వైమానిక దాడులపైనా
‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతిఘటనగా తామూ వైమానిక దాడులు జరిపినట్లు ఐఎ్‌సపీఆర్ ప్రకటించింది. అందుకు సంబంధించినదిగా చెబుతూ పాకిస్థానీ మీడియాకు వీడియోలను షేర్ చేసింది. పాకిస్థాన్ మీడియా వాటిని ప్రసారం చేసింది. అయితే.. జర్మనీకి చెందిన వార్తాసంస్థ డీడబ్ల్యూ అవి తప్పుడు వీడియోలు అంటూ కథనాన్ని ప్రచురించింది. పాక్ సైన్యం షేర్ చేసిన ఫుటేజీ 2023లో హమా్‌సపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులకు సంబంధించినదని తేల్చిచెప్పింది. ఏఎ్‌ఫపీ వార్తా సంస్థ కూడా ఆ ఫుటేజీని తొలుత షేర్ చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకోవడం గమనార్హం. ఇక, పాక్, పీవోకేలో భారత్ జరిపిన దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో సైనికాధికారులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనల్లో ఉగ్రవాది హఫీజ్ రవూఫ్ ముందు వరసలో నిల్చున్నాడు. అయితే.. అతను ఉగ్రవాది కాదని, సామాన్య పౌరుడని ఐఎ్‌సపీఆర్ డీజీ విలేకరులకు తెలిపారు. దీన్ని పీఐబీ ఎండగట్టింది. అతను కరడుగట్టిన ఉగ్రవాది అని పేర్కొనే ఆధారాలను ఎక్స్‌లో పోస్టు చేసింది.
మన డ్రోన్లను కూల్చేశారట!
పాకిస్థాన్ ఎయిర్ బేస్‌లపై భారత్ ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి దాటాక హరూప్ డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే..! 10వ తేదీ ఉదయం తమ వైమానిక రక్షణ వ్యవస్థలు 26 భారత డ్రోన్లను కూల్చేశాయని, భారత్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూడా ధ్వంసం చేశామని పాక్ ఆర్మీ ప్రకటించింది. ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా దీనిపై ప్రకటనలు చేశారు. నిజానికి హరూప్ ‘సూసైడ్ డ్రోన్’ రకానికి చెందినవి. ఇవి తమ లక్ష్యాలను ఛేదించేందుకు పేలిపోతాయి. సోమవారం నాటి భారత డీజీఎంవోల ప్రెస్‌మీట్‌లో.. పాకిస్థాన్‌కు చెందిన 11 ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసినట్లు శాటిలైట్ చిత్రాలతో సహా ఆధారాలను చూపించారు. దీన్ని బట్టి.. సూసైడ్ డ్రోన్లు తమ పనిని పూర్తిచేశాక.. మిగిలిన శకలాలను సీజ్ చేసిన పాక్ ఆర్మీ.. వాటిని తాము కూల్చివేసినట్లు తప్పుగా క్లెయిమ్ చేసుకుంది.
2023 నాటి యుద్ధ నౌకల విన్యాసం
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల ఐఎ్‌సపీఆర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాక్ నేవీ అధికారి ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. భారత నౌకాదళాన్ని కట్టడి చేయడానికి జలాంతర్గాములతో పాటు.. అరేబియా సముద్రంలో నౌకలను మోహరించామంటూ ఓ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో మూడు యుద్ధ నౌకలు, వాటిపై ఎగురుతున్న నిఘా విమానాలు ఉన్నాయి. నిజానికి ఆ ఫొటో 2023 నాటిదని ఫ్యాక్ట్‌చెక్కర్లు తేల్చారు. చైనా-పాకిస్థాన్ సంయుక్తంగా చేపట్టిన యుద్ధనౌకల విన్యాసాల ఫొటో(ద యురేషియన్ టైమ్స్‌లో ప్రచురితమైంది)ను పాక్ నౌకాదళ అధికారి ప్రజెంటేషన్‌లో చూపించారని పేర్కొన్నారు.
పాక్ ఎయిర్‌బేస్‌ల పైనా అబద్ధాలే
పాకిస్థాన్‌లోని నూర్‌ఖాన్, రహీంయార్‌ఖాన్, సర్గోదా వంటి ఎయిర్‌బేస్‌లు ధ్వంసమైనట్లు భారతీయ మీడియా ఈనెల 10న కథనాలను ప్రసారం చేసింది. దాన్ని ఫేక్‌న్యూ్‌సగా చెప్పిన ఐఎ్‌సపీఆర్.. తమ వైమానిక స్థావరాలు సురక్షితంగా ఉన్నట్లు చెప్పింది. కానీ, మాక్సర్ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా భారత మీడియా నిజమే చెబుతోందని ఫ్యాక్ట్‌చెక్కర్లు నిర్ధారించారు. సర్గోదా ఎయిర్‌బేస్ రన్‌వే 14/32, 06/12 వద్ద ధ్వంసమైన శాటిలైట్ చిత్రాలను ఎక్స్‌లో పోస్టు చేశారు. భోలారీ ఎయిర్‌బేస్‌లో విమానాల హ్యాంగర్ ధ్వంసమైన చిత్రాలను ప్రదర్శించారు. భారత డీజీఎంవోలు కూడా సోమవారం నాటి ప్రెస్‌మీట్‌లో వాటికి ఆధారాలను చూపించారు.
Updated Date - May 14 , 2025 | 08:38 AM