IED Blast in Chhattisgarh Forests: అడవుల్లో పేలిన ఐఈడీ.. జవాన్ మృతి
ABN, Publish Date - Aug 19 , 2025 | 05:19 AM
కూంబింగ్ చేస్తున్న బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి డీఆర్‌జీ జవాన్ మృతి చెందగా..
చర్ల, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కూంబింగ్ చేస్తున్న బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి డీఆర్‌జీ జవాన్ మృతి చెందగా.. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు అడవుల్లో సోమవారం ఉదయం జరిగింది. అక్కడి అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందడంతో బీజాపూర్‌కు చెందిన డీఆర్‌జీ బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. కూంబింగ్ అనంతరం డీఆర్‌జీ బలగాలు తిరుగుపయనమవగా.. మావోయిస్టులు అమర్చిన ఐఈడీపై జవాన్లు కాలు వేయడంతో అది పేలింది. జవాన్ దినేష్ నాగ్ (43) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, భరత్, హేమ్ల, మండ్రు అనే ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని బీజాపూర్ వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన జవాన్‌కు నివాళులర్పించి భౌతికకాయాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Updated Date - Aug 19 , 2025 | 05:19 AM