ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Annamalai: త్రిభాషా విధానంతో 2026 ఎన్నికలకు వెళ్తాం: అన్నామలై

ABN, Publish Date - Feb 18 , 2025 | 08:23 PM

ప్రధానమంత్రి కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరూ హిందీని అంగీకరించాలని చెప్పడం లేదని, డీఎంకే కూటమి నేతలు నేతలు చేస్తున్న నిరసనల్నీ వృథా అని అన్నామలై అన్నారు.

చెన్నై: హిందీని బలవంతంగా తమపై రుద్దుతున్నారంటూ రాష్ట్రంలోని 'ఇండియా' కూటమి పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తుండటంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై (Annamalai) మంగళవారంనాడు స్పందించారు. హిందీని అంగీకరించాలని ఎవరూ బలవంతం చేయడం లేదని అన్నారు. విద్యార్థులను ఇండియా కూటమి పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రధానమంత్రి కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరూ హిందీని అంగీకరించాలని చెప్పడం లేదని అన్నారు. డీఎంకే కూటమి నేతలు నేతలు చేస్తున్న నిరసనల్నీ వృథా అని అన్నారు. హిందీని నేర్చుకోకుంటే వేరే భాషను నేర్చుకోవచ్చని, బలవంతం ఏమీ లేదని చెప్పారు.

Annamalai : ఆలయాలు ఎలా ఉండకూడదో తమిళనాడులో చూడొచ్చు


రాష్ట్ర విద్యావిధానం ఫెయిల్

రాష్ట్రంలోని చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చేరుతున్నారని, రాష్ట్ర విద్యావిధానం పూర్తిగా విఫలమైందని అన్నామలై అన్నారు. త్రిభాషా విధానం డిమాండ్‌పై 2026 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ వెళ్తుందని స్పష్టం చేశారు. ''తమిళనాడుకు 100 కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు తేవాలని అనుకుంటున్నాను. కేవీ స్కూళ్లకు అన్బిల్ మహేష్ పొయ్యమొళి స్థలం ఇస్తారా? రాష్ట్రంలో త్రిభాషా విధానం తీసుకురావాలనే డిమాండ్‌పైనే మేము ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తాం'' అని ఆయన చెప్పారు.


లాంగ్వేజ్ లెర్నింగ్‌పై సంతకాల సేకరణ

ఏ భాష నేర్చుకోవాలనే దానిపై తల్లిదండ్రుల నుంచి ఫీడ్‌బ్యాక్ కోరుతూ మూడు నెలల పాటు సంతకాల సేకరణ చేపట్టనున్నట్టు అన్నామలై ప్రకటించారు. మార్చి నుంచి ఈ కార్యక్రమం ఉంటుందని, ఆ సమాచారం సేకరించి రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. నేరుగా బీజేపీ ప్రతినిధుల దృష్టికి కూడా దీనిని తీసుకువెళ్తామని తెలుపారు.


ఉదయనిధి ఏమన్నారు?

తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఆరోపించారు. ''విద్య అనేది గతంలో రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో ఉండేది. ఇప్పుడు దానిని ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తోంది. కానీ మన ముఖ్యమంత్రి ఇందుకు ఎంతమాత్రం అంగీకరించడం లేదు. దయచేసి మా మీద హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయవద్దు'' అని ఒక ప్రకటనలో ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ఆర్థిక హక్కు కోరితే హిందీని అంగీకరించాలని తమిళనాడు బెదిరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Rahul Gandhi: అర్ధరాత్రి నిర్ణయం సరికాదు... సీఈసీ ఎంపికపై రాహుల్

Bengaluru: బెంగళూరులో తాగు నీటిని ఇతర అవసరాలకు వాడితే భారీ జరిమానా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2025 | 08:23 PM