ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శాటిలైట్‌ టోల్‌పై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

ABN, Publish Date - Apr 19 , 2025 | 03:30 AM

శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎంపిక చేసిన టోల్‌ప్లాజాల వద్ద ఏఎన్‌పీఆర్‌, ఫాస్టాగ్‌ ఆధారిత టోలింగ్‌ను అమలు చేయనున్నారు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18: దేశవ్యాప్తంగా శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థ అమలుకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. వచ్చే మే 1 నుంచి శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థ అమల్లోకి రానున్నట్టు మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఈమేరకు మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. టోల్‌ ప్లాజాల ద్వారా వాహనాలు సజావుగా వెళ్లేందుకు, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకుగాను ఎంపిక చేసిన టోల్‌ ప్లాజాల వద్ద ‘ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ (ఏఎన్‌పీఆర్‌)-ఫాస్టాగ్‌ ఆధారిత బారియర్‌లెస్‌ టోలింగ్‌ వ్యవస్థ’ను అమలు చేయనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ అడ్వాన్స్‌డ్‌ టోలింగ్‌ వ్యవస్థ.. వాహనాల నంబర్‌ ప్లేట్లను గుర్తించే ఏఎన్‌పీఆర్‌ టెక్నాలజీ, ప్రస్తుత ఫాస్టాగ్‌ వ్యవస్థను మిళితం చేస్తుందని తెలిపింది.

Updated Date - Apr 19 , 2025 | 03:31 AM