MP Housing Project: ఎంపీల కొత్త ఫ్లాట్లు ప్రారంభానికి సిద్ధం
ABN, Publish Date - Aug 05 , 2025 | 05:34 AM
ఎంపీల హౌసింగ్ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీలోని బాబా ఖరక్‌సింగ్ మార్గ్‌లో నిర్మిస్తున్న కొత్త నివాస భవనాల పనులు పూర్తయ్యాయి. మొత్తం 184 రెసిడెన్షియల్ ఫ్లాట్లను నాలుగు అపార్టుమెంట్లుగా నిర్మించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఎంపీల హౌసింగ్ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీలోని బాబా ఖరక్‌సింగ్ మార్గ్‌లో నిర్మిస్తున్న కొత్త నివాస భవనాల పనులు పూర్తయ్యాయి. మొత్తం 184 రెసిడెన్షియల్ ఫ్లాట్లను నాలుగు అపార్టుమెంట్లుగా నిర్మించారు. ఒక్కో అపార్ట్‌మెంట్‌లో 25 అంతస్తులు ఉంటాయి. ప్రతి ఫ్లాట్ వైశాల్యం దాదాపు 5వేల చదరపు అడుగులు. ఒక్కొక్క ఫ్లాట్‌లో ఐదు బెడ్ రూమ్‌లు, ఎంపీల సహాయ సిబ్బంది కోసం రెండు ప్రత్యేక గదులు ఉంటాయి.
ప్రతీ అపార్ట్‌మెంట్‌లో అండర్‌గ్రౌండ్‌లో రెండు అంతస్తులను పార్కింగ్ కోసం కేటాయించారు. మొత్తంగా ఐదు వందలకు పైగా వాహనాలను ఇక్కడ పార్క్ చేయవచ్చు. సామ్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ ఇటుకలను వాడకుండా కేవలం కాంక్రీటు-సిమెంటు మిక్సింగ్(ఆర్సీసీ), అల్యూమీనియంతో రెండేళ్లలో ఈ అపార్ట్‌మెంట్లను నిర్మించింది. దీనికి రూ.550కోట్లు ఖర్చయ్యాయి.
Updated Date - Aug 05 , 2025 | 05:34 AM