ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నీట్‌ పరీక్షలో డబ్బుదే కీలక పాత్ర: స్టాలిన్‌

ABN, Publish Date - Jun 24 , 2025 | 03:00 AM

నీట్‌ పరీక్షలో ఆద్యంతం డబ్బు కీలక పాత్ర పోషిస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్‌ విమర్శించారు. 2025 యూజీ వైద్య కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ పరీక్షలో అవినీతికి పాల్పడి...

చెన్నై, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ‘నీట్‌’ పరీక్షలో ఆద్యంతం డబ్బు కీలక పాత్ర పోషిస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్‌ విమర్శించారు. 2025 యూజీ వైద్య కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ పరీక్షలో అవినీతికి పాల్పడి, అర్హత లేని వారికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు ఇప్పిస్తామని నగదుతీసుకుని మోసగించారంటూ మహారాష్ట్రకు చెందిన జాతీయ పరీక్షా ఏజెన్సీ అధికారి, పలువురువైద్యులపై సీబీఐ కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్‌ తన ఎక్స్‌లో స్పందిస్తూ... ‘‘నీట్‌ అనేది మెరిట్‌ గురించి కాదు, మార్కెట్‌ గురించి అని నిరూపించే మరో కేసు. అందుకే మేము ‘నీట్‌’ నీట్‌ కాదని గట్టిగా చెబుతున్నాము. నీట్‌ ప్రారంభం నుంచి చివరి వరకు డబ్బు మాత్రమే ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నీట్‌ పరీక్షా వ్యవస్థ ఒక నైతిక కుంభకోణం’’ అని పోస్ట్‌ చేశారు.

Updated Date - Jun 24 , 2025 | 03:02 AM