ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra: జిప్‌లైన్ తెగడంతో 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ బాలిక.. షాకింగ్ వీడియో వైరల్

ABN, Publish Date - Jun 15 , 2025 | 05:00 PM

జిప్‌లైన్ తెగడంతో ఓ బాలిక 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడి గాయాలపాలైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Manali zipline accident

ఇంటర్నెట్ డెస్క్: జిప్‌లైన్‌‌ తెగడంతో ఓ బాలిక కింద పడి తీవ్ర గాయాలపాలైన ఘటన మనాలీలో వెలుగు చూసింది. దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ బాలికకు పలు చోట్ల ఫ్రాక్చర్‌లు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన బాలిక (12) త్రిష బిజ్వే మనాలీలో విహారయాత్రకు వెళ్లిన సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. జిప్‌లైన్‌ ద్వారా లోయమీదుగా కిందకు వస్తుండగా ఒక్కసారిగా తాడు తెగింది. దీంతో, చిన్నారి దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోయింది. చిన్నారిని తీవ్ర గాయాలయ్యాయని కుటుంబసభ్యులు తెలిపారు. శస్త్రచికిత్స కూడా జరిగిందని అన్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు బాధిత బాలిక తండ్రి తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఆదివారం ఉత్తరాఖండ్‌‌లో హెలికాఫ్టర్ కుప్పకూలింది. డెహ్రాడూన్‌ నుంచి కేదార్‌నాథ్‌ వెళ్తున్న సమయంలో గౌరికుండ్, త్రిజుగి నారాయణ్ మధ్య హెలికాఫ్టర్ కూలిపోయింది. ఇది ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాఫ్టర్ అని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా సమాచారం. అంతకుమునుపు మరో హెలికాఫ్టర్ కూడా ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ వరుస ప్రమాదాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సీరియస్ అయ్యారు. హెలీ సర్వీసులపై స్పెషల్ ఆపరేషన్ ప్రొసీజర్ (SOP) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి..

27 ఏళ్ల క్రితం ఎయిర్ ఇండియా తరహా ప్రమాదం.. ప్రాణాలు దక్కించుకున్న 11ఏ సీటు ప్యాసెంజర్

విమాన ప్రమాదం.. బాధితులకు ఎయిర్ ఇండియా అదనపు ఆర్థిక సాయం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 15 , 2025 | 05:05 PM