ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nagpur Curfew Aurangzeb Tomb Row: ఔరంగజేబు సమాధిపై వివాదం.. నాగ్‌పూర్‌లో కర్ఫ్యూ

ABN, Publish Date - Mar 18 , 2025 | 09:47 AM

ఔరంగజేబు సమాధి తొలగించాలన్న డిమాండ్స్ హింసాత్మకంగా మారడంతో నాగ్‌పూర్ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు.

Nagpur Curfew Aurangzeb Tomb Row

ఇంటర్నెట్ డెస్క్: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి తొలగింపు డిమాండ్స్ హింసాత్మక ఘటనలకు దారి తీయడంతో నాగ్‌పూర్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 ప్రకారం, నగర పోలీసు కమిషనర్ రవీందర్ కుమార్ సింఘాల్ పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని కొత్వాలీ, గణేశ్‌పేఠ్, తెహ్‌సీల్, లకడ్‌గంజ్, పాంచ్‌పావులీ, శాంతినగర్, షక్కర్2డరా, నందన్‌వన్, ఇమామ్‌వాడా, యోధరానగర్, కపిల్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అన్నారు (Nagpur Curfew Aurangzeb Tomb Row).


Also Read: ఔరంగజేబు సమాధి తొలగించాలంటూ డిమాండ్స్.. నాగ్‌పూర్‌లో చెలరేగిన హింస

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిన్న నగరంలోని మహల్ ప్రాంతంలోగల శివాజీ మహరాజ్ విగ్రహం వద్ద విశ్వ హిందూ పరిషత్, బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఔరంగజేబు ఫొటో, సమాధి నమూనాకు నిప్పు పెట్టారు.

దీనికి ప్రతిగా మరికొందరు నిరసనకు దిగారు. పోలీసులపై, వారి వాహనాలపై రాళ్లు రువ్వారు. ఓ వాహనానికి నిప్పు పెట్టారు. లాఠీచార్జ్, భాష్పవాయువు ప్రయోగించి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ హింసాత్మక ఘటనలో పలువురికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.


Also Read: త్వరలో ఐపీఎల్ సీజన్.. హాట్‌స్టార్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందజేస్తున్న జీయో

ఈ ఘటనలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాంతి నెలకొల్పాలని పిలుపునిచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనపై ముఖ్యమంత్రి కూడా దృష్టిసారించారని, ఈ నేపథ్యంలో ఎటువంటి వదంతులను నమ్మొద్దని అన్నారు. ఛావా చిత్రం తరువాత ఔరంగజేబు సమాధి వివాదానికి కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. మొఘల్ చక్రవర్తి సమాధాని తొలగించాలన్న డిమాండ్స్ స్థానికంగా పెరుగుతున్నాయి.

Read Latest and National News

Updated Date - Mar 18 , 2025 | 10:56 AM