Pahalgam Attack: కంచె కింద పాక్కుంటూ వెళ్లి చిన్న గోతిలో గంటసేపు నక్కి..
ABN, Publish Date - Apr 28 , 2025 | 04:42 AM
పహల్గామ్ ఉగ్రదాడిలో మైసూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రసన్న కుమార్ భట్ త్రుటిలో తప్పించుకున్నారు. తన భార్య, సోదరుడితో కలిసి తీవ్ర భయానక పరిస్థితులను ఎదుర్కొన్న ప్రసన్న, సీనియర్ అధికారిగా ఉన్న సోదరుడి సలహాతో తమ కుటుంబాన్ని రక్షించి, దాడి నుంచి తప్పించుకున్నారు.
పహల్గాం ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న మైసూర్ టెకీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: పహల్గాంలోని ఉగ్రదాడి నుంచి మైసూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రసన్న కుమార్ భట్ త్రుటిలో తప్పించుకున్నారు. ఆనాటి భయానక పరిస్థితులను, తాము అనుభవించిన ఉద్విగ్న క్షణాలను ఆయన సోషల్ మీడియా వేదికగా వివరించారు. ప్రసన్న తన భార్య, సోదరుడు, వదినతో కలసి 22న బైసారన్ వెళ్లారు. మధ్యాహ్నం. 2.25 గంటల సమయంలో రెండుసార్లు తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. తర్వాత కాసేపటికే కాల్పుల మోతలతో పాటు పర్యాటకుల అర్తనాదాలు వినిపించాయి. భారత సైన్యంలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న ప్రసన్న సోదరుడికి అది ఉగ్రదాడి అని అర్థమైంది. పరిస్థితిని అంచనా వేసిన ఆయన వెంటనే వీరిద్దరి కుటుంబాలతో పాటు అక్కడే ఉన్న మరో 35- 40మందిని అప్రమత్తం చేశారు. ఉగ్రవాదులు వేచి ఉన్న ప్రధాన ద్వారానికి దూరంగా వారిని తీసుకెళ్లారు. అదృష్టవశాత్తూ అక్కడి కంచె కింద ఒక ఇరుకైన మార్గం కనిపించడంతో అందరూ దాని కిందుగా పాకుతూ అవతలకు వెళ్లి, కొండ కిందకు పరిగెత్తడం ప్రారంభించారు. బురదగా ఉన్న వాలు ప్రాంతం ప్రమాదకరంగా ఉండటంతో కొంతమంది జారి పడిపోయారు. అయినా ఎవరూ పరుగు మాత్రం ఆపలేదు. ఈ క్రమంలో దాడి జరుగుతున్న ప్రాంతానికి కొంతదూరంలో ఒక చిన్న గొయ్యి కనిపించడంతో ప్రసన్న దంపతులు అందులో తలదాచుకున్నారు. మధ్యాహ్నం 3గంటల సమయానికి కాల్పుల శబ్దాలు తగ్గుముఖం పట్టడంతో ప్రసన్న సోదరుడు తన పై అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 28 , 2025 | 05:34 AM