Central Govt: ఎం.ఎస్ స్వామినాథన్ శత జయంతికి రూ.100 నాణెం
ABN, Publish Date - Jul 14 , 2025 | 05:28 AM
ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, భారతరత్న ప్రొఫెసర్ ఎం.ఎస్ స్వామినాథన్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రూ. 100 విలువ గల నాణెం విడుదల చేస్తూ...
న్యూఢిల్లీ, జూలై 13: ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, భారతరత్న ప్రొఫెసర్ ఎం.ఎస్ స్వామినాథన్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రూ. 100 విలువ గల నాణెం విడుదల చేస్తూ కేంద్రం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. స్వామినాథన్‌ను భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు. అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశ పెట్టడంలో ఆయన చేసిన కృషి కారణంగా దేశం ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించగలిగింది. ఈ ప్రత్యేక నాణెం 44 మిల్లీ మీటర్ల చుట్టు కొలతతో, 35 గ్రాముల బరువుతో ఉంటుంది. ఇది 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ మిశ్రమాలతో తయారయింది.
Updated Date - Jul 14 , 2025 | 05:29 AM