ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bioenergy: బయో ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు ఇక మరింత ఈజీ

ABN, Publish Date - Jun 28 , 2025 | 05:28 PM

దేశంలో ప్రతి రోజూ విడుదలయ్యే వ్యర్థాల నుండి శక్తిని తయారు చేసి ఆర్థికంగా పరిపుష్టమయ్యేందుకు యువతకి ఇదో మంచి అవకాశం. ఇప్పుడు ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచడానికి, ఆర్థిక సహాయాన్ని వేగవంతం చేయడానికి MNRE మార్గదర్శకాలను సవరించింది.

Bioenergy

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బయో ఎనర్జీ విస్తరణకు మరింత ఊతమిచ్చేలా వేగంగా చర్యలు చేపడుతున్నారు. కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) శనివారం దీనికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను ప్రకటించింది. మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన పనితీరు ఆధారిత పర్యావరణ వ్యవస్థను సృష్టించడమే లక్ష్యంగా కొత్త సవరణలను తీసుకొచ్చారు. జాతీయ బయోఎనర్జీ కార్యక్రమం కింద వ్యర్థాల నుండి శక్తి (WtE)ని ఉత్పత్తి చేసే కార్యక్రమానికి ఇవి ఎంతో సహకరిస్తాయి.

కొత్తగా తెచ్చిన సవరణలు వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ ఫ్లాంట్స్ పెట్టాలనుకునే వాళ్లకి ఫ్రేమ్‌వర్క్ ప్రక్రియ సులభతరమవుతుంది. ఈ ప్రాజెక్టులు పెట్టడానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని వేగంగా అందిస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలకు, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న ఇంకా మధ్య తరహా సంస్థలకు (MSMEలు) ఫ్రెండ్లీ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ క్రియేట్ చేయడమే దీని ప్రధాన లక్ష్యం.

అంతేకాక, ఈ సవరించిన మార్గదర్శకాలు, ప్లాంట్ల ఏర్పాటుకు డాక్యుమెంటేషన్ వర్క్‌ని బాగా తగ్గిస్థాయి. తద్వారా ఫ్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు త్వరితగతిన వస్తాయి. కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG), బయోగ్యాస్, విద్యుత్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి ఈ సవరణలు వీలు కల్పిస్తాయి. తద్వారా 2070 నాటికి నికర-సున్నా ఉద్గారాలను సాధించాలనే భారతదేశ లక్ష్యం చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.

బయో ఎనర్జీ (Bioenergy) అనేది జీవ సంబంధమైన (బయోమాస్) పదార్థాల నుండి ఉత్పత్తి అయ్యే శక్తి. ఇది పునరుత్పాదక శక్తి వనరు, ఇది మొక్కలు, చెట్లు, వ్యవసాయ వ్యర్థాలు, జంతు వ్యర్థాలు, ఇంకా ఇతర సేంద్రీయ పదార్థాల నుండి తయారవుతుంది. ఆయా పదార్థాలను దహనం, లేదా ఇతర ప్రక్రియల ద్వారా శక్తిగా మార్చవచ్చు.

బయో ఎనర్జీ రకాలు:

బయోఫ్యూయల్స్: బయోఎథనాల్, బయోడీజిల్ వంటివి, ఇవి రవాణా కోసం ఉపయోగించబడతాయి.

బయోగ్యాస్: సేంద్రీయ వ్యర్థాల నుండి ఉత్పత్తి అయ్యే మీథేన్ వాయువు, వంట ఇంకా విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.

బయోమాస్ ఎనర్జీ: చెక్క, వ్యవసాయ అవశేషాలు, లేదా ఇతర సేంద్రీయ పదార్థాలను దహనం చేసి వేడి లేదా విద్యుత్ ఉత్పత్తి చేయడం.

ప్రయోజనాలు:

పునరుత్పాదకం మరియు పర్యావరణ అనుకూలమైనది.

ఫాసిల్ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా వ్యర్థ నిర్వహణకు సహాయపడుతుంది.

ఉదాహరణలు:

చెరకు నుండి బయోఎథనాల్ తయారీ.

గోబర్ గ్యాస్ ప్లాంట్ల ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి.

ఇవీ చదవండి:

సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు


జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 28 , 2025 | 06:05 PM