Miss World 2025: మిస్‌వరల్డ్ టాప్-24లో భారత్
ABN, Publish Date - May 22 , 2025 | 05:04 AM
తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల్లో 108 దేశాల నుండి 24 మంది అగ్రశ్రేణి అందగత్తెలు ఎంపికయ్యారు. భారత ప్రతినిధి నందినీ గుప్తా ఆసియా-ఓసియానా ఖండం నుంచి విజేతగా నిలవడానికి పోటీపడుతుంది.
‘హెడ్ 2 హెడ్’ పోటీల్లో 84 మంది ఔట్
రేపు ఖరారు కానున్న టాప్-10 జాబితా
హైదరాబాద్, మే 21(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆతిథ్యమిస్తున్న మిస్ వరల్డ్-2025 పోటీలు రసవత్తరంగా మారుతున్నాయి. పోటీలో పాల్గొన్న 108 దేశాల సుందరీమణుల నుంచి టాప్-24 జాబితాను మిస్‌వరల్డ్ నిర్వాహక సంస్థ బుధవారం ప్రకటించింది. ఇందులో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందినీ గుప్తా సహా.. 4 ఖండాల నుంచి 24 మంది అందగత్తెలు ఉన్నారు. వీరిలో యూర్‌పలోని పోలండ్, మాల్టా, ఇటలీ, ఎస్తోనియా, జర్మనీ, నెదర్లాండ్స్, వేల్స్, చెక్ రిపబ్లిక్, ఐర్లాండ్ దేశాలకు చెందిన 9 మంది ఉన్నారు. ఇక అమెరికా-కరేబియన్ ఖండం నుంచి అమెరికా, బ్రెజిల్, జమైకా, అర్జెంటి నా, కేమెన్ ఐలాండ్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన ఆరుగురు ఎంపికయ్యారు. కాగా, ఆసియా-ఓసియానా ఖండం నుంచి భారత్, శ్రీలంక, ఆస్ర్టేలియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందినవారు. ఆఫ్రికా నుంచి నైజీరియా, ఇథియోపియా, కామెరూన్, కెన్యా దేశాల సుందరీమణులు ఉన్నారు. కాగా పోటీదారులు ‘బ్యూటీ విత్ పర్పస్’ పేరుతో తమ సేవా కార్యక్రమాలను వివరించే ‘హెడ్ 2 హెడ్’ పోటీలు మంగళవారం ప్రారంభమై.. బుధవారం ముగిశాయి. రెండు రోజుల్లో మొత్తం 108 మంది ఈ పోటీలో పాల్గొన్న అనంతరం టాప్-24 జాబితాను ప్రకటించారు. దీంతో మిగతా 84 దేశాలు పోటీల నుంచి వైదొలిగాయి.
రేపు తేలనున్న తుది జాబితా..
ఈ నెల 23న నిర్వహించనున్న కీలకమైన పోటీలో 24 మంది అందాలభామలు తమ ప్రతిభను చాటనున్నారు. వీరిలో నుంచి టాప్-10ను ఎంపిక చేస్తారు. వారు ఈ నెల 31న హెచ్‌ఐసీసీలో జరిగే తుది పోటీల్లో పాల్గొంటా రు. ఆ పోటీల్లో టాప్-10లోనుంచి ఒక్కో ఖండం నుంచి ఇద్దరు చొప్పున 4 ఖండాలకు చెందిన 8 మందిని ఎంపిక చేస్తారు. చివరికి ఒక్కో ఖండం నుం చి ఒకరి చొప్పున నలుగురిని ఖరారు చేస్తారు. వీరిని మిస్ వరల్డ్ ఆసియా, మిస్ వరల్డ్ ఓసియానా, మిస్ వరల్డ్ ఆఫ్రికా, మిస్ వరల్డ్ యూరప్ విజేతలుగా ప్రకటిస్తారు. ఈ నలుగురిలో నుంచి మిస్ వరల్డ్ విజేతను ఎంపిక చేస్తారు. భారత్ ప్రతినిధిగా ఉన్న నందినీ గుప్తా ఆసియా-ఓసియానా ఖండం నుంచి విజేతగా నిలవాలంటే ఈ నాలుగు దేశాలతో పోటీపడాల్సి ఉంటుంది.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి
Updated Date - May 22 , 2025 | 05:04 AM