Viral Video: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హెలికాప్టర్ల ప్రదర్శన చూశారా..
ABN, Publish Date - Jan 26 , 2025 | 11:42 AM
దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా హెలికాప్టర్ల ప్రత్యేక ప్రదర్శన ఆకట్టుకుంది. కర్తవ్య పథ్ మీదుగా జాతీయ జెండాలను ఎగురుతూ కనిపించిన దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఆ వీడియో ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.
2025 గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day 2025 Celebration) ఢిల్లీ (delhi) రాజ్‌పథ్‌లో (కర్తవ్య పథ్) ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నిలిచింది మాత్రం Mi-17V-5 హెలికాప్టర్ల ప్రదర్శన అని చెప్పవచ్చు. ఎందుకంటే 129 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన Mi-17V-5 హెలికాప్టర్లు కర్తవ్య పథ్ మీదుగా జెండాలతో ఎగిరి ఆకట్టుకున్నాయి. ఆ క్రమంలో ఆకాశంలో రంగురంగులను ప్రదర్శించి హెలికాప్టర్లు దేశభక్తి భావనను ప్రేరేపించాయి. వింగ్ కమాండర్లు శైలేందర్ సింగ్, రోహిత్ తివారీ, వినయ్‌ల నేతృత్వంలో కెప్టెన్ అలోక్ అహ్లవత్ గైడెన్స్‌లో ఈ ప్రత్యేక ప్రదర్శన జరిగింది. వారు హెలికాప్టర్లకు త్రివర్ణ పతాకాలని జోడించి వేడుకలకు మరింత శక్తి, ఉత్సాహాన్ని అందించారు.
ఈ ప్రదర్శన గణతంత్ర దినోత్సవంలో భారతదేశం సైనిక శక్తి, సాంకేతికత, దేశభక్తి భావనలను చాటిచెప్పింది. హెలికాప్టర్లు చురుకైన పనితీరుతో అత్యంత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ గగనతలంలో ఎగిరాయి. ఈ ప్రదర్శన మన దేశ సైనిక బలాన్ని, గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఒక అద్భుతమైన ఉదాహరణ అని చెప్పవచ్చు. ఈ హెలికాప్టర్లు భారతదేశ వివిధ రకాల సహాయక చర్యల్లో భాగస్వామ్యమవుతున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ ప్రదర్శన ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
Droupadi Murmu: జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము .. గన్స్‌తో సెల్యూట్
RepublicDay 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ ఏమన్నారంటే..
Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
Republic Day 2025: గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్..
Gold and Silver Rates Today: పైపైకి వెళ్తున్న పసిడి రేట్లు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Jan 26 , 2025 | 11:47 AM