ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mental Harassment: మానసిక వేధింపులను ఎదుర్కొనే మహిళల్లో గుండె జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువ

ABN, Publish Date - Aug 18 , 2025 | 04:02 AM

మానసిక వేధింపులను ఎదుర్కొనే మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు సాధారణం కన్నా 41% ఎక్కువని హార్వర్డ్‌ వర్సిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.

  • హార్వర్డ్‌ వర్సిటీ పరిశోధకులు అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 17: మానసిక వేధింపులను ఎదుర్కొనే మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు సాధారణం కన్నా 41% ఎక్కువని హార్వర్డ్‌ వర్సిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒకరు ఏదో ఒక సందర్భంలో వేధింపులకు గురవుతున్నారని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘అది చేయవద్దు.. ఇది చేయవద్దు.. అని మహిళలపై ఇంట్లో ఆంక్షలు విధిస్తారు. పనిచేసే చోట్ల మహిళలు ఎన్నో వేధింపులు ఎదుర్కొంటారు.

మానసిక వేధింపుల్లో హింస ఉండని కారణంగా చాలా మంది వీటిని తక్కువ ప్రమాదకరమైనవిగా భావిస్తారు. కానీ, ఇవి మహిళల వయస్సు పెరుగుతున్న కొద్దీ వారి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని కలుగజేస్తాయి. గుండె జబ్బులు, స్ట్రోక్‌కు కారణం అవుతాయి’’ అని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకురాలు రెబెకా తెలిపారు. మానసిక వేధింపులతో మహిళల్లో ఒత్తిడి పెరిగి, అది నరాల వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని, తద్వారా వారి శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందని వివరించారు. రెండు దశాబ్దాల పాటు నిర్వహించిన ఈ అధ్యయనాన్ని ‘సర్క్యులేషన్‌’ అనే జర్నల్‌లో ప్రచురించారు.

Updated Date - Aug 18 , 2025 | 04:02 AM