Maharashtra: ముంబైలో 5వేల మంది పాకిస్థానీలు
ABN, Publish Date - Apr 27 , 2025 | 01:15 AM
మహారాష్ట్రలో 5,000 మంది పాకిస్థానీలు ఉన్నారని, వీరిలో 1,000 మంది స్వల్పకాలిక వీసాలు కలిగి ఉన్నట్లు మంత్రి యోగేష్ కదమ్ తెలిపారు. వీరిని దేశం విడచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
ముంబై, ఏప్రిల్ 26: మహారాష్ట్రలో 5వేల మంది పాకిస్థానీలు ఉన్నారని, వీరిలో 1,000 మంది స్వల్పకాలిక వీసాలు కలిగి ఉన్నట్టు ఆ రాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ శనివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారందరినీ దేశం విడిచివెళ్లాలని చెప్పామన్నారు. దేశంలో కొంత మంది 8-10 ఏళ్లుగా నివసిస్తున్నారని, కొందరు పెళ్లి కూడా చేసుకున్నారని చెప్పారు. కొందరు తమ పాకిస్థాన్ పాస్‌పో్‌స్టను సరెండర్ చేసి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 21మంది పాకిస్థానీలు ఉన్నట్లు గుర్తించారు. వారిని వెంటనే పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు, గుజరాత్ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో భాగంగా వెయ్యి మందికి పైగా బంగ్లాదేశ్‌కు చెందిన అక్రమ వలసదారులను అహ్మదాబాద్, సూరత్‌లో అదుపులోకి తీసుకున్నట్టు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హర్ష్ సంఘవి శనివారం తెలిపారు. వీరిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నట్టు తెలిపారు. వీరందరినీ దేశం నుంచి పంపేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. గుజరాత్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో 890 మందిని, సూరత్‌లో 134 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్
Updated Date - Apr 27 , 2025 | 01:15 AM