పాక్ ర్యాలీలో ‘పహల్గాం’ సూత్రధారి
ABN, Publish Date - May 30 , 2025 | 06:21 AM
పహల్గాం దాడి వెనుక కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న ఉగ్ర సంస్థ లష్కరే తాయిబా కమాండర్ సైఫుల్లా కసూరీ మరోసారి బహిరంగ వేదికపై కనిపించాడు.
బహిరంగ వేదికపై లష్కరే కమాండర్ సైఫుల్లా
న్యూఢిల్లీ, మే 29: పహల్గాం దాడి వెనుక కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న ఉగ్ర సంస్థ లష్కరే తాయిబా కమాండర్ సైఫుల్లా కసూరీ మరోసారి బహిరంగ వేదికపై కనిపించాడు. అది కూడా పాకిస్థాన్ రాజకీయ నేతలు, పలువురు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు పాల్గొన్న ఒక ర్యాలీలో వారితో కలిసి వేదిక పంచుకున్నాడు.
పాక్ అణుపరీక్షల వార్షికోత్సవం సందర్భంగా పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో వీరంతా ఒక్కచోట చేరారు. ఈ సందర్భంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ర్యాలీల్లో పాల్గొన్న వాళ్లలో లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు, భారత్ ఉగ్రవాదిగా ముద్ర వేసిన తల్హా సయీద్ కూడా పాల్గొన్నాడు.
Updated Date - May 30 , 2025 | 06:21 AM