Uttar Pradesh: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన లడ్డూ వేదిక.. ఆ తర్వాత జరిగిందిదే..
ABN, Publish Date - Jan 28 , 2025 | 11:29 AM
ఉత్తర్ ప్రదేశ్: బాగ్‌పత్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదినాథుడి లడ్డూ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. లడ్డూ వేదిక కుప్పకూలడంతో ఐదుగురు భక్తులు మృతిచెందగా.. 50 మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి.
ఉత్తర్ ప్రదేశ్: బాగ్‌పత్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదినాథుడి లడ్డూ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. లడ్డూ వేదిక కుప్పకూలడంతో ఆరుగురు భక్తులు మృతిచెందగా.. 50 మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి. లడ్డూల కోసం భక్తులు పెద్దఎత్తున పోటీపడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఆరా తీశారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించాలని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
Viral News: మరో ఘోరం.. భార్య వేధింపులు తాళలేక భర్త ఏం చేశాడంటే..
బాగ్‌పత్ జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ తెలిపిన వివరాల ప్రకారం.. "బరౌత్‌లోని స్థానిక జైన కమ్యూనిటీ 30 ఏళ్లుగా ఏటా 'లడ్డూ మహోత్సవం' నిర్వహిస్తోంది. జైన తీర్థంకరుడు ఆదినాథుని నిర్వాణానికి గుర్తుగా ఈ ఏడాది సైతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వందల మంది భక్తులు తరలివచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం లడ్డూలు పంచిపెట్టేందుకు పూజాలు సిద్ధం అయ్యారు. కాగా వాటిని పొందేందుకు ఎదురుబొంగులతో నిర్మించిన వేదికపైకి వందల మంది భక్తులు ఒక్కసారిగా ఎక్కారు. దీంతో వేదిక కూలిపోయి భారీ ప్రాణనష్టం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించాం. స్వల్పంగా గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి ఇళ్లకు పంపించాం. తీవ్రగాయాలైన వారికి చికిత్స అందిస్తున్నామని" తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Maha Kumbh Mela : మహాకుంభమేళా.. సనాతన సంస్కృతికి ఐక్యతా చిహ్నం!
Atrocity Case: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
Updated Date - Jan 28 , 2025 | 11:52 AM