Share News

Maha Kumbh Mela : మహాకుంభమేళా.. సనాతన సంస్కృతికి ఐక్యతా చిహ్నం!

ABN , Publish Date - Jan 28 , 2025 | 06:08 AM

సనాతన సంస్కృతి, జీవన తత్వానికి మహాకుంభమేళా ఐక్యతా చిహ్నమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. సామరస్యమే సనాతన సంస్కృతికి జీవనాడిగా పేర్కొన్నారు. మహాకుంభమేళాలో సోమవారం ఆయన

Maha Kumbh Mela  : మహాకుంభమేళా.. సనాతన సంస్కృతికి ఐక్యతా చిహ్నం!

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. సంగమంలో పుణ్య స్నానం

మహాకుంభ్‌నగర్‌(యూపీ), జనవరి 27: సనాతన సంస్కృతి, జీవన తత్వానికి మహాకుంభమేళా ఐక్యతా చిహ్నమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. సామరస్యమే సనాతన సంస్కృతికి జీవనాడిగా పేర్కొన్నారు. మహాకుంభమేళాలో సోమవారం ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో త్రివేణీ సంగమంలో సంప్రదాయ బద్ధంగా పుణ్యస్నానం ఆచరించారు. పుణ్యస్నానాల అనంతరం సంగమానికి హారతి ఇచ్చి, అక్షయవట(మర్రిచెట్టు) వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా, పవిత్ర సంగమ స్నానానికి ముందు అమిత్‌ షా.. జునా పీఠాధిపతి అవధేశానంద గిరీజీ మహరాజ్‌ సహా పలువురు సాధువులతో సంగమ ప్రాంతంలోనే భేటీ అయ్యారు. ఇక, కేంద్ర హోం మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు కనీవినీ ఎరుగని భద్రతను ఏర్పాటు చేశారు. ప్రయాగ్‌రాజ్‌ నగరంలో ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు సహా భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 13న ప్రారంభమైన మహాకుంభమేళాకు సోమవారం నాటికి 13.21 కోట్ల మంది భక్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.

Updated Date - Jan 28 , 2025 | 06:08 AM