National Highway Projects: 5న జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం
ABN, Publish Date - Apr 27 , 2025 | 01:37 AM
తెలంగాణలో 6,280 కోట్ల రూపాయలతో నిర్మించిన 285 కిలోమీటర్ల జాతీయ రహదారులను మే 5న ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వీటితో పాటు 961 కోట్లతో మరో రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులను నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
రూ.961 కోట్లతో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన
గడ్కరీ చేతుల మీదుగా కార్యక్రమాలు: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సుమారు రూ.6,280 కోట్లతో నిర్మించిన 285 కి.మీ. మేర జాతీయ రహదారులను మే 5న ప్రారంభిస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ప్రాజెక్టులను జాతికి అంకితం ఇస్తామని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తెలంగాణ రోడ్లు, భవనాల విభాగంతో కలిసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆయా పనులను చేపట్టిందని తెలిపారు. వీటితోపాటు రూ.961 కోట్లతో 51కి.మీ. మేర చేపట్టనున్న రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.
ఇవీ ప్రాజెక్టులు..
నిర్మల్-ఖానాపూర్ మధ్య 17.19 కి.మీ.,మంచిర్యాల-రేపల్లెవాడ మధ్య 42 కి.మీ., రేపల్లెవాడ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 52.6 కి.మీ., 44వ జాతీయ రహదారిపై నాగ్‌పూర్-హైదరాబాద్ సెక్షన్‌లో 2కి.మీ. మేర పనులను ప్రారంభించనున్నట్టు కిషన్‌రెడ్డి వివరించారు. అలాగే, నాగ్‌పూర్-హైదరాబాద్ సెక్షన్‌లో పలు ప్రాంతాల్లో అండర్‌పా్‌సలు, సర్వీస్ రోడ్లు, ఫుట్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్-బెంగళూరు సెక్షన్‌లో ఆరాంఘర్-శంషాబాద్ మధ్యలో 10కి.మీ, హైదరాబాద్‌లోని అంబర్‌పేట వద్ద 1.47 కి.మీ. ఫ్లైఓవర్, బీహెచ్‌ఈఎల్ జంక్షన్ వద్ద 1.65 కి.మీ. ఫ్లైఓవర్, 44వ జాతీయ రహదారిపై నాగ్‌పూర్-హైదరాబాద్ సెక్షన్‌లో మెదక్ జిల్లా రెడ్డిపల్లి జంక్షన్ వద్ద కి.మీ. మేర ఆరులేన్ల అండర్‌పాస్, సర్వీస్ రోడ్డు.. మెదక్ జిల్లా జాప్తిశివనూర్ వద్ద కి.మీ.మేర అండర్ పాస్, సర్వీస్ రోడ్డు.. మెదక్ జిల్లా గోల్డెన్ దాబా వై జంక్షన్ వద్ద కి.మీ. మేర సర్వీస్ రోడ్డు, ఆరులేన్ల అండర్ పాస్.. కామారెడ్డి జిల్లా టేక్రియాల్, పొందుర్తి ఎక్స్ రోడ్డు వద్ద 3.55 కి.మీ. మేర అండర్ పాస్, ఇతర అభివృద్ధి పనులు.. కామారెడ్డి జిల్లా పద్మాజివాడ జంక్షన్ వద్ద 1.17 కి.మీ. అండర్ పాస్, స్లిప్ రోడ్డు.. 163 జాతీయ రహదారిపై హైదరాబాద్-వరంగల్ సెక్షన్‌లో ఆలేరు-జీడికల్ ఎక్స్ రోడ్డు వద్ద 1.68కి.మీ. మేర నాలుగు లేన్ల అండర్ పాస్ పనులను ప్రారంభించనున్నట్టు కిషన్‌రెడ్డి వివరించారు. 65వ జాతీయ రహదారిపై హైదరాబాద్-విజయవాడ సెక్షన్‌లో ధర్మోజిగూడ వద్ద ఆరు లేన్ల అండర్‌పాస్, సర్వీస్ రోడ్డు నిర్మాణం.. 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్-బెంగళూరు సెక్షన్‌లో బాలానగర్ వద్ద 1.26 కి.మీ. మేర ఆరు లేన్ల అండర్ పాస్, 163వ జాతీయ రహదారిపై హైదరాబాద్-యాదగిరి సెక్షన్‌లో అంకుశాపూర్ వద్ద 2.77 కి.మీ. మేర ఆరులేన్ల అండర్ పాస్, ఘట్‌కేసర్ జంక్షన్ వద్ద ఆరులేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం, 44వ జాతీయ రహదారిపై నాగ్‌పూర్-హైదరాబాద్ సెక్షన్‌లో 3.45 కి.మీ. మేర కోమటిపల్లి, వల్లూరు జంక్షన్ల అభివృద్ధి, ఆరులేన్ల అండర్‌పా్‌సల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నట్టు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్
Updated Date - Apr 27 , 2025 | 01:37 AM