Banu Mushtaq: కన్నడ రచయిత్రికి ఇంటర్నేషనల్ బుకర్
ABN, Publish Date - May 22 , 2025 | 05:11 AM
కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ 2025 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఆమె కథల సేకరణ ‘హార్ట్ ల్యాంప్’కు ఈ పురస్కారం దక్కింది, ఇది కన్నడ సాహిత్యంలో తొలిసారి అందిన ఘనత.
‘హార్ట్ ల్యాంప్’ కథలకు ప్రతిష్ఠాత్మక
పురస్కారాన్ని గెలుచుకున్న బాను ముస్తాక్
బుకర్ దక్కించుకున్న తొలి కన్నడ పుస్తకం
కథల అనువాదకురాలు దీపా భస్తీతో కలిసి
లండన్‌లో పురస్కారం స్వీకరించిన బాను
బెంగళూరు, మే 21 (ఆంధ్రజ్యోతి) : కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. తన కథల పుస్తకం ‘హార్ట్ ల్యాంప్’కుగాను ఆమెను 2025 సంవత్సరానికి ఈ పురస్కారం వరించింది. లండన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంగళవారం అనువాదకురాలు దీపా భస్తీతో కలిసి బాను అవార్డును అందుకున్నారు. బుకర్ ప్రైజ్ కన్నడ సాహిత్యానికి లభించడం ఇదే తొలిసారి. దీనిని భిన్నత్వానికి లభించిన విజయంగా రచయిత్రి బాను అభివర్ణించారు. ఆమె కర్ణాటకలోని హాసన్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ముస్లిం సామాజికవర్గానికి చెందిన బాలికలు, యువతుల దైనందిన జీవితాలను తన కథల ద్వారా బాను పరిచయం చేశారు. దక్షిణాదిలో పితృస్వామిక సమాజాల్లోని మహిళల ధీరోదత్తతకు ‘హార్ట్ ల్యాంప్’లోని 12 కథలు అద్దం పట్టాయని బుకర్ ప్రైజ్ వర్గాలు తెలిపాయి. కాగా, అందమైన భాషకు లభించిన మరింత అందమైన విజయం అంటూ తన సంతోషాన్ని అనువాదకురాలు దీపా భస్తీ పంచుకున్నారు.
భాను 1990 నుంచి 2023 వరకు రాసిన కథల్లోంచి 12 కథలను ఎంపిక చేసుకుని దీపా భస్తీ ‘హార్ట్ ల్యాంప్’ కథల పేరిట ఇంగ్లిషులోకి అనువదించారు. నగదు పురస్కారం కింద ఈ ఇద్దరికి చెరో 25వేల పౌండ్లు (రూ.28, 76,845) లభించాయి. భారతీయ సాహిత్యానికి గత మూడేళ్లలో బుకర్ ప్రైజ్ రావడం ఇది రెండోసారి.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి
Updated Date - May 22 , 2025 | 05:12 AM