Jyoti Malhotra: నన్ను పెళ్లి చేసుకోవా
ABN, Publish Date - May 22 , 2025 | 05:46 AM
పాకిస్థాన్ గూఢచారి అలి హసన్‌తో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా నిర్వహించిన వాట్సాప్ చాటింగ్ బయటపడింది. భారత నిఘా సమాచారాన్ని కోడ్ భాషలో పంచుకున్నట్లు ఆరోపణల మధ్య, దుబాయ్ నుంచీ లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతాలు కూడా పోలీసులు గుర్తించారు.
పాకిస్థాన్‌లోనే మన పెళ్లి!
పాక్ ఏజెంటుతో జ్యోతి చాటింగ్
న్యూఢిల్లీ, మే 21 : పాకిస్థాన్‌కు గూఢచారిగా వ్యవహరించిన హరియాణాకు చెందిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై విచారణలో ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరితో ఆమె జరిపిన వాట్సాప్ చాటింగ్ తాజాగా బయటకు వచ్చింది. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్’ అధికారి అలి హసన్‌కు ఆమె చాలా దగ్గర అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అతడితో తరచూ మాట్లాడుతూ ఉండేది. వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌లను ఈ కేసు విచారిస్తోన్న హరియాణా పోలీసులు సేకరించారు. అందులో ఒకదాంట్లో జ్యోతి హసన్‌ను ‘‘నన్ను పాకిస్థాన్‌లోనే పెళ్లి చేసుకో...’’ అని కోరింది. ఈ ఇద్దరి మధ్య వాట్సాప్ చాట్‌ల ద్వారా కోడ్ భాషలోనూ పలుసార్లు చర్చలు సాగాయి. భారత నిఘా కార్యకలాపాల గురించి ఈ కోడ్ భాషలో చర్చించారు. పోలీసులు తమ విచారణలో జ్యోతికి 4బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఒక ఖాతాకు దుబాయి నుంచీ లావాదేవీలు జరిపారు. ఇదిలా ఉండగా, గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన ఓ అధికారిని 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి
Updated Date - May 22 , 2025 | 05:53 AM