ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: సుప్రీం కొలీజియం సభ్యురాలిగా జస్టిస్‌ నాగరత్న

ABN, Publish Date - May 25 , 2025 | 04:05 AM

సుప్రీంకోర్టు కొలీజియం సభ్యురాలిగా జస్టిస్‌ బి.వి. నాగరత్న నియమితులయ్యారు. 2027లో భారతదేశ ప్రథమ మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ, మే 24: సుప్రీంకోర్టు కొలీజియం సభ్యురాలిగా జస్టిస్‌ బి.వి.నాగరత్న నియమితులయ్యారు. ఈ నియామకం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుంది. ఇంతవరకు కొలీజియంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా పదవీ విరమణ చేయడంతో సీనియార్టీలో అయిదో స్థానంలో ఉన్న జస్టిస్‌ నాగరత్న నియమితులయ్యారు. ప్రస్తుతం కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రం నాథ్‌, జస్టిస్‌ కె.జి.మహేశ్వరి, జస్టిస్‌ నాగరత్న సభ్యులుగా ఉన్నారు. నూతన కొలీజియం ప్రథమ సమావేశం సోమవారం జరిగే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో ఉన్న మూడు జడ్జీల పోస్టుల ఖాళీలు, వివిధ హైకోర్టుల్లోని ఖాళీలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. సీనియారిటీ ప్రకారం జస్టిస్‌ నాగరత్న 2027 సెప్టెంబరు 23న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. అదే జరిగితే ఆమె భారతదేశ ప్రథమ మహిళా ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. నెల రోజుల పాటు ఆ పదవిని నిర్వహించి 2027 అక్టోబరు 29న పదవీ విరమణ చేసే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO

Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..


Updated Date - May 25 , 2025 | 04:06 AM