ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: పరువునష్టం కేసులో.. రాహుల్‌ గాంధీకి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

ABN, Publish Date - May 25 , 2025 | 04:22 AM

2018లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఝార్ఖండ్ ప్రత్యేక కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాహుల్ విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి విచారణ కోసం ప్రత్యక్ష హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

జారీ చేసిన ఝార్ఖండ్‌ కోర్టు

రాంచీ, మే 24: లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై ఝార్ఖండ్‌లోని ప్రజాప్రతినిధుల(ఎంపీ, ఎమ్మెల్యే) కేసుల ప్రత్యేక కోర్టు నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌(ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2018లో ఝార్ఖండ్‌లో జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీ సందర్భంగా రాహుల్‌గాంధీ అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు(ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి) అమిత్‌షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘హత్య కేసులో ఉన్నవారు కూడా బీజేపీ అధ్యక్షుడు కావొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై ఝార్ఖండ్‌ బీజేపీ నేత ప్రతాప్‌ కతియార్‌ 2018 జూలై 9న చాయ్‌బాసాలోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌(సీజేఎం) కోర్టులో పరువునష్టం దావా వేశారు. 2020లో ఝార్ఖండ్‌ హైకోర్టు ఈ కేసును రాంచీలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. కేసు విచారణను ప్రారంభించిన ప్రజాప్రతినిధుల కోర్టు.. రాహుల్‌గాంధీకి సమన్లు జారీ చేసినా.. ఆయన విచారణకు హాజరవ్వకపోవడంతో తొలుత బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. దీనిపై రాహుల్‌ ఝార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ ఏడాది మార్చి 20న పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో.. ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వచ్చేనెల 26న జరిగే తదుపరి విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని రాహుల్‌గాంధీని ఆదేశించింది.


ఇవి కూడా చదవండి

Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO

Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..


Updated Date - May 25 , 2025 | 04:23 AM