Baba Vanga Prediction: బాబోయ్.. జూలై 5న జపాన్ వెళ్లం
ABN, Publish Date - Jun 24 , 2025 | 04:04 AM
కొత్త బాబా వంగా గా పేరొందిన జపాన్ జ్యోతిష్యురాలు రియో టత్సుకి బాంబ్ పేల్చారు వచ్చే నెల 5న జపాన్‌లో భారీ సునామీ రాబోతోందన్నారు. గతంలో ఆమె చెప్పిన భవిష్యవాణి చాలా వరకు నిజమవడంతో...
జపాన్‌లో జూలై 5న భారీ విలయం వస్తుందన్న కొత్త ‘బాబా వంగా’ రియో టత్సుకి జోస్యమే కారణం
న్యూఢిల్లీ, జూన్ 23: కొత్త ‘బాబా వంగా’గా పేరొందిన జపాన్ జ్యోతిష్యురాలు రియో టత్సుకి బాంబ్ పేల్చారు! వచ్చే నెల 5న జపాన్‌లో భారీ సునామీ రాబోతోందన్నారు. గతంలో ఆమె చెప్పిన భవిష్యవాణి చాలా వరకు నిజమవడంతో ఇప్పుడు జపాన్ వాసులే కాదు.. ప్రపంచ పర్యాటకులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. గతంలో టత్సుకి చెప్పిన జ్యోతిషం చాలా సందర్భాల్లో నిజమైంది. 2011లో టొహోకు భూకంపం, ప్రిన్సెస్ డయానా, ఫ్రెడ్డీ మెర్క్యురీల మరణం, కొవిడ్-19 మహమ్మారి గురించి ఆమె ముందే చెప్పారు. ఈ క్రమంలో జూలై 5న జపాన్‌లో విలయం రాబోతోందని చెప్పడంతో.. ప్రపంచ పర్యాటకులు జపాన్ సందర్శనను రద్దు చేసుకుంటున్నారు. వచ్చే నెలలో జపాన్ పర్యటనకు బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసేసుకుంటున్నారు. హాంకాంగ్ నుంచి జపాన్‌కు విమాన టికెట్ల రిజర్వేషన్లు 83 శాతం తగ్గిపోయాయి.
Updated Date - Jun 24 , 2025 | 04:07 AM