Kashmir Avalanche: కశ్మీర్‌లో భారీ హిమపాతం ముప్పు... వామ్మో.. ఇంత మంచు పేరుకుపోయిందేంటి..
ABN, Publish Date - Feb 27 , 2025 | 08:05 PM
Kashmir Avalanche: హిమాలయ రాష్ట్రం కశ్మీర్‌లో భారీ హిమపాతం సంభవించింది. రోజుల తరబడి విపరీతంగా మంచు కురుస్తోంది. రహదారులు మూసివేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అడుగుల ఎత్తులో మంచి కుప్పలు పేరుకుపోవడంతో ప్రజలు బయట అడుగుపెట్టాలంటేనే హడలిపోతున్నారు.
Kashmir Avalanche: బండిపోరా కశ్మీర్‌లోని ఒక అందమైన ప్లేస్, కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితులున్న ప్రదేశం. ఇది ప్రధానంగా మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులతో నిండిపోయిన ప్రదేశం. ఇక్కడ ప్రత్యేకంగా రాజ్దాన్ పాస్, గురెజ్ లోయ, తులైల్ లోయ, బక్తూర్ మరియు కంజ్లావన్ వంటి ప్రాంతాలు హిమపాతం వల్ల తరచుగా ప్రభావితమవుతుంటాయి. ఈ ప్రాంతంలో ప్రస్తుతం భారీ హిమపాతం చోటుచేసుకుంది, దాదాపు మూడు అడుగుల మంచు పేరుకుపోయింది. గురెజ్‌లోని రోడ్లు పూర్తిగా మూసివేశారు వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. నిజానికి ఇటీవల కశ్మీర్‌లో చాలా ప్రాంతాల్లో హిమపాతం, వర్షాలు నమోదయ్యాయి. అటు మంగళవారం నుంచే మంచు కురుస్తోంది, ముఖ్యంగా పిర్ పంజాల్ కొండలపై కూడా భారీ హిమపాతం నమోదైంది. ఇది ప్రయాణికులు, స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించే స్థితికి దారితీసింది.
కొన్నేళ్లుగా భారీ మంచు తుపాన్లు..
గురెజ్ లోయ అత్యంత మంచు ప్రభావిత ప్రాంతాల్లో ఒకటి. ఇది పర్వతాల నడుమ ఉన్నందున ఇక్కడ హిమపాతం చాలా తీవ్రంగా ఉంటుంది. గతంలోనూ ఇక్కడ అనేక హిమపాతం ఘటనలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో ఇవి భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. 2017లో జరిగిన హిమపాతంలో కొన్ని ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి, అంతేకాకుండా కొందరు ప్రజలు కూడా మృత్యువాతపడ్డారు. 2020లో కూడా ఇదే విధంగా గురెజ్ ప్రాంతంలో భారీ మంచు తుపాను వచ్చింది. అప్పటికి సైనికులు సహాయక చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
బండిపోరా సమీపంలోని రాజ్దాన్ పాస్ ప్రాంతం కూడా మంచు తుపాన్లకు ప్రసిద్ధి. ప్రతి ఏడాది శీతాకాలంలో ఇక్కడ రహదారులు మూసివేయాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున మంచు పేరుకుపోవడం వల్ల ప్రయాణం అసాధ్యం అవుతుంది. అయితే, ఇది పర్యాటకానికి అనుకూలంగా మారుతుంది. గుల్మార్గ్, దూధ్‌పత్రి, సోనామార్గ్, పహల్గామ్ వంటి ప్రదేశాలు పూర్తిగా మంచుతో కప్పబడి పర్యాటకులతో కళకళలాడుతున్నాయి.
ఈ ప్రాంతాల్లో హిమపాతం సాధారణమైనదే అయినా, కొన్నిసార్లు ఇది విపత్తుగా మారుతుంది. కశ్మీర్‌లో ప్రతిసారీ భారీ మంచు పడినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అత్యవసర నియంత్రణ గదులను సిద్ధం చేస్తుంది. ప్రజలను ముందస్తుగా హెచ్చరించడం, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టడం, సైనికులను అప్రమత్తం చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది. ఇక్కడి ప్రజలు శీతాకాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోతుంది. కొన్ని మారుమూల గ్రామాల్లోని ప్రజలు బహిరంగ ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు కోల్పోతారు. ఎప్పుడైనా హిమపాతం కారణంగా పొంచి ఉన్న ప్రమాదం ఉందని స్థానికులు చెబుతుంటారు.
ప్రస్తుతం జరుగుతున్న హిమపాతం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఎంత కాలం కొనసాగుతుందో అనేది వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బండిపోరా, గురెజ్, రాజ్దాన్ పాస్ ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాశ్మీర్‌లో ఈశాన్య ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రతి ఏడాది ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
Read also : BSNL New Recharge Plan : సరసమైన ధరకే BSNL కొత్త ప్లాన్.. టెన్షన్‌లో జియో, ఎయిర్‌టెల్..
IPL 2025: నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా ఆగయా.. ఇక వేట మొదలు
Updated Date - Feb 27 , 2025 | 08:39 PM