ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tejas: మరి కొనేళ్లల్లో భారత్‌కు యుద్ధ విమానాల తయారీలో స్వావలంబన.. తేజస్ ప్రాజెక్టు మాజీ డైరెక్టర్

ABN, Publish Date - May 16 , 2025 | 10:57 PM

మరి కొన్నేళ్లల్లో భారత్ యుద్ధ విమానాల తయారీలో స్వావలంబన సాధిస్తుందని తేజస్ యుద్ధ విమానం ప్రాజెక్టు మాజీ డైరెక్టర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత హరినారాయణ తెలిపారు.

India fighter jet manufacturing

ఇంటర్నెట్ డెస్క్: రాబోయే కొన్నేళ్లల్లో యుద్ధ విమానాల తయారీలో భారత్ స్వావలంబన సాధిస్తుందని తేజస్ యుద్ధ విమానం ప్రాజెక్టు మాజీ డైరెక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట హరినారాయణ తెలిపారు. స్వదేశంలోనే యుద్ధ విమానాల తయారీకి కావాల్సిన వ్యవస్థలు పూర్తిగా అభివృద్ధి చెందాయని అన్నారు. భారతీయ వాయుసేన అవసరాలకు అనుగూణంగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకుని అన్ని కేటగిరీలకు చెందిన యుద్ధ విమానాలను త్వరలో భారత్ స్వంతంగా తయారు చేస్తుందని చెప్పారు. ఇప్పటికే భారత్ స్వల్ప శ్రేణి, మధ్య శ్రేణికి చెందిన పలు విమానాలు, మానవ రహిత విహంగాలను తయారు చేస్తోందని చెప్పారు.


‘‘భారత్ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసే రోజు కూడా త్వరలోనే వస్తుంది. ప్రస్తుతం మాత్రం రష్యా, ఫ్రాన్స్ నుంచి కొన్నింటిని దిగుమతి చేసుకుంటున్నాము’’ అని ఆయన తెలిపారు. గురువారం ఓ ప్రైవేటు యూనివర్సిటీలో జరిగిన కాన్వొకేషన్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయాలను వెల్లడించారు. తేజస్ వినియోగం పెరగడం.. స్వదేశంలో నిర్మించిన యుద్ధ విమానాల ప్రాముఖ్యతను తెలుపుతోందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ దాడులను దీటుగా తిప్పి కొట్టిన భారత్ తన సామర్థ్యాలను నిరూపించుకుందని అన్నారు. స్వంతంగా రక్షణ ఉత్పత్తులను డిజైన్ చేసి రూపొందించుకోవడం భారత్ ప్రయాణంలో తొలి దశ అని అన్నారు. భార్గవాస్త్ర ప్రయోగం విజయవంతమవడంపై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు.


ప్రస్తుతం తేజస్ యుద్ధ విమానాలు వాయుసేన, నావికాదళంలో సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరికల్లా తేజస్ మార్క్ 2 కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తేజస్ కంటే మెరుగైన ఇంజెన్, అధిక పేలోడ్ సామర్థ్యం, అత్యాధునిక ఏవియానిక్స్‌తో తేజస్ మార్క్2ను డిజైన్ చేశారు. ఇక భారత వాయుసేన ఇప్పటికే 123 తేజస్ విమానాలకు ఆర్డర్ పెట్టింది.

ఇవి కూడా చదవండి:

ఎవరెస్ట్ పర్వతంపై భారతీయుడి మృతి.. డెత్ జోన్ వద్ద ఘటన..

తుర్కియే సంస్థ సెలెబీ ఏవియేషన్‌ అనుమతులు రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం..

టర్కీ నుంచి దిగుమతులు ఆగిపోతే.. వీటి రేట్లు విపరీతంగా పెరుగుతాయి

కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - May 16 , 2025 | 11:02 PM