ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: 'ఇండియన్ స్టేట్' వ్యాఖ్యలకు రాహుల్‌పై ఎఫ్ఐఆర్

ABN, Publish Date - Jan 19 , 2025 | 04:27 PM

దేశంతో పోరాటం సాగిస్తున్నామని ప్రకటించడం ద్వారా నిందితుడు ఉద్దేశపూర్వకంగానే విచ్ఛిన్నకర శక్తులను, ప్రజలపై తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టినట్టు ఫిర్యాదుదారు ఆరోపించారు. వరుస వైఫల్యాలతో నైరాశ్యంతోనే రాహుల్ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారన్నారు.

న్యూఢిల్లీ: దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ఆసోంలోని గువాహటి పాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. రాహుల్ వ్యాఖ్యలు దేశ సార్వభౌమాధికారానికి, ఐక్యత, దేశ సమగ్రతకు ప్రమాదకరం కలిగిస్తాయని పేర్కొంటూ భారతీయ న్యాయసంహిత లోని 152, 197(1) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. మోన్‌జిత్ చాటియా అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు.

Delhi Elections 2025: భుములిస్తే ఇళ్లు కట్టిస్తా.. మోదీకి కేజ్రీవాల్ లేఖ


దేశంతో పోరాటం సాగిస్తున్నామని ప్రకటించడం ద్వారా నిందితుడు ఉద్దేశపూర్వకంగానే విచ్ఛిన్నకర శక్తులను, ప్రజలపై తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టినట్టు ఫిర్యాదుదారు ఆరోపించారు. వరుస వైఫల్యాలతో నైరాశ్యంతోనే రాహుల్ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారన్నారు. ప్రజాస్వామ్య విధానాల ద్వారా ప్రజా విశ్వాసం పొందలేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ స్టేట్‌పై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. విపక్ష నేతగా ప్రజాస్వామ్య సంస్థలపై విశ్వాసాన్ని పెంపొందించాల్సిన నేత.. ఇందుకు బదులుగా తన హోదాను దుర్వినియోగం చేసుకుంటూ తప్పుడు ప్రచారం, తిరుగుబాటు చర్యలకు పాల్పడటం దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి ముప్పు అని తన ఫిర్యాదులో చాటియా పేర్కొన్నారు.


రాహుల్ గాంధీ గత బుధవారంనాడు న్యూఢిల్లీలో నూతన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, నిజమైన స్వాతంత్ర్యంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని, తాము ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీతో పాటు భారతదేశంపై కూడా పోరాడుతున్నామని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు విమర్శల దాడికి దిగారు. దేశంతో పోరాడుతున్నామంటూ చెప్పడం ద్వారా కాంగ్రెస్ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడిందని బీజేపీ ధ్వజమెత్తింది.


ఇవి కూడా చదవండి..

Saif Ali Khan: సినిమాలను మించే ట్విస్ట్.. సైఫ్ కేసులో నిందితుడ్ని ఎలా పట్టుకున్నారంటే..

Saif Ali Khan:ఆ పని కోసం సైఫ్ ఇంటికి వెళ్లి.. ఇంతలోనే..

Read Latest National News and Telugu News

Updated Date - Jan 19 , 2025 | 04:39 PM