Pakistan Tensions: రోడ్డుపై ఫైటర్ జెట్ల ల్యాండింగ్ టేకాఫ్
ABN, Publish Date - May 03 , 2025 | 04:45 AM
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గंगा ఎక్స్‌ప్రెస్వేపై యుద్ధ విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సామర్థ్యాన్ని భారత వాయుసేన పరిశీలించింది. ఈ ప్రయోగంలో రాఫెల్, సుఖోయ్-30, మిరాజ్-2000 వంటి యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.
గంగా ఎక్స్‌ప్రె్‌సవేపై వాయుసేన విన్యాసాలు
న్యూఢిల్లీ, మే 2: భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రె్‌సవేపై యుద్ధ విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సామర్థ్యాన్ని భారత వాయుసేన పరిశీలించింది. యుద్ధం లేదా, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లు రహదారిపై టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేందుకు వీలుగా యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలో గంగా ఎక్స్‌ప్రె్‌సవేపై 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌స్ట్రి్‌పను నిర్మించారు. అత్యాధునిక లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలు ఉన్న దీనిపై పగలు, రాత్రి ఎప్పుడైనా యుద్ధ విమానాలను ల్యాండింగ్, టేకాఫ్ చేయవచ్చు. ఇలా ఉదయం-రాత్రి ల్యాండింగ్, టేకాఫ్ చేసే వీలున్న హైవే ఎయిర్‌స్ట్రిప్ భారత్‌లో ఇదే మొదటిది. అలాగే.. ఉత్తరప్రదేశ్‌లోని హైవేలపై నిర్మించిన ఎయిర్‌స్ట్రి్‌పల్లో ఇది నాలుగోది. గతంలో ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రె్‌సవే, పూర్వాంచల్ ఎక్స్‌ప్రె్‌సవే, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రె్‌సవేలపై కూడా రన్‌వేలు నిర్మించారు. తాజాగా గంగా ఎక్స్‌ప్రె్‌సవేపై జలాలాబాద్ వద్ద నిర్మించిన రన్‌వేను శుక్రవారం ప్రారంభించిన వాయుసేన ఉదయం, రాత్రి వేళ రెండు దశల్లో దీన్ని పరిశీలించింది. ఈ క్రమంలో చేపట్టిన విన్యాసాల్లో రాఫెల్, సుఖోయ్-30 ఎంకేఐ, మిరాజ్-2000, మిగ్-29, జాగ్వార్, సీ-130జే సూపర్ హెర్కులస్, ఏఎన్-32 యుద్ధ విమానం, ఎంఐ-17 వీ5 హెలికాప్టర్లు పాల్గొన్నాయి.
ఇవి కూడా చదవండి..
Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట
Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..
Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు
Updated Date - May 03 , 2025 | 04:45 AM