Rafale fighter jets: ఇక నేవీలోనూ రాఫెల్ సత్తా
ABN, Publish Date - Apr 29 , 2025 | 04:34 AM
భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో నౌకాదళ సామర్థ్యాన్ని పెంచే దిశగా కీలక ఒప్పందం కుదుర్చుకున్న భారత్ ఫ్రాన్స్‌తో 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు భారీ ఒప్పందం చేయడం జరిగింది. 2031 నాటికి ఈ విమానాలు భారత్‌కు అందే అవకాశం ఉంది.
త్వరలోనే భారత్‌కు 26 రాఫెల్ మెరైన్ జెట్‌లు
వాటిలో 22 సింగిల్ సీటర్లు.. 4 ట్విన్ సీటర్లు
రూ.63 వేల కోట్లతో ఫ్రాన్స్‌తో భారీ ఒప్పందం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో మన నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కీలక ముందడుగు పడింది. వాయుసేనకే పరిమితమైన రాఫెల్ యుద్ధ విమానాలు త్వరలోనే భారత నేవీకి కూడా అందనున్నాయి. నౌకాదళం కోసం 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌తో భారత్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రూ.63వేల కోట్ల రూపాయల విలువైన మెగా డీల్‌పై ఇరుదేశాలు సోమవారం సంతకాలు చేశాయి. ఇది ఇరు ప్రభుత్వాల మధ్య నేరుగా కుదిరిన ఒప్పందం. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్, నేవీ వైస్ చీఫ్ అడ్మిరల్ కె స్వామినాథన్ పాల్గొన్నారు. స్వదేశీ విమానవాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో రాఫెల్ జెట్లను మోహరించేందుకు ఫ్రాన్స్ రక్షణ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ నుంచి భారత్ ఈ విమానాలు కొనుగోలు చేయనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) ఈ కొనుగోలుకు ఆమోదం తెలిపిన మూడు వారాల్లోనే ఈ డీల్ కుదరడం గమనార్హం. ఒప్పందంలో భాగంగా.. భారత నౌకాదళానికి 22 సింగిల్ సీటర్లు, నాలుగు ట్విన్ సీటర్లతో కూడిన మొత్తం 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలను డసాల్ట్ ఏవియేషన్ 37 నుంచి 65 నెలల్లోగా డెలివరీ చేయాల్సి ఉంటుంది. అంటే 2031 నాటికి ఈ 26 యుద్ధవిమానాల డెలివరీలు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
For National News And Telugu News
Updated Date - Apr 29 , 2025 | 04:34 AM