ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India GDP 2025: 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

ABN, Publish Date - May 26 , 2025 | 02:41 AM

జపాన్‌ను అధిగమించిన భారత్‌ ఇప్పుడు నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. నీతిఆయోగ్‌ ప్రకారం, ప్రస్తుత జీడీపీ $4.187 ట్రిలియన్లు కాగా, భారత్‌ 2047 నాటికి $30 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా ముందుస్తు ప్రణాళికలు కొనసాగుతోంది.

జపాన్‌ను అధిగమించాం

మన జీడీపీ రూ.356 లక్షల కోట్లు

ఇదే వేగంతో వెళ్తే.. మూడేళ్లలో

మూడో స్థానాన్నీ కైవసం చేసుకుంటాం

నీతిఆయోగ్‌ సీఈఓ సుబ్రమణ్యం వెల్లడి

గత పదేళ్లలో భారత్‌ తలసరి ఆదాయం

రెట్టింపైందని ఐఎంఎఫ్‌ వెల్లడి

న్యూఢిల్లీ, మే 25: జపాన్‌ను అధిగమించి భారత్‌.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. ప్రస్తుత ధరల ప్రకారం భారత్‌ జీడీపీ 4.187 ట్రిలియన్‌ డాలర్లు (రూ.3,56,61,000 కోట్లు) కాగా.. జపాన్‌ జీడీపీ 4.186 ట్రిలియన్‌ డాలర్లు (రూ.3,56,53,000 కోట్లు). నీతిఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రమణ్యం ఈ వివరాలను వెల్లడించారు. ‘భారత్‌ జపాన్‌ను దాటేసింది. ఐంఎ్‌ఫఎఫ్‌ గణాంకాల ఆధారంగా దీనిని తెలియజేస్తున్నా. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే మనకన్నా పెద్ద ఆర్థిక వ్యవస్థలు. మన ప్రణాళికలకు అనుగుణంగా మన వృద్ధి కొనసాగితే.. మరో రెండున్నర లేదా మూడేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తాం’ అని తెలిపారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐఎంఎఫ్‌ విడుదల చేసిన ‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఔట్‌లుక్‌’ నివేదికలో 2025లో భారత్‌ 4.19 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో జపాన్‌ను అధిగమించి.. నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేసింది. దీనికి తగినట్లుగానే, కేవలం నెల రోజుల వ్యవధిలోనే భారత్‌ 4వ స్థానానికి చేరుకోవటం విశేషం. గత పదేళ్లలో భారత్‌లో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యిందని, 2013-14లో తలసరి ఆదాయం 1,438 డాలర్లు (రూ.1,22,476) కాగా, 2025 నాటికి 2,880 డాలర్లకు (రూ.2,45,293) పెరిగిందని ఐఎంఎఫ్‌ ఆ నివేదికలో తెలిపింది. 2025లో భారత్‌ 6.2 శాతం వృద్ధిరేటును కొనసాగిస్తుందని, ఇది అంతకుముందు అంచనా వేసిన 6.5 శాతం కన్నా తక్కువని పేర్కొంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, వాణిజ్యపరమైన ఉద్రిక్తతలే దీనికి కారణమని విశ్లేషించింది. 2025లో ప్రపంచం ఆర్థిక వృద్ధి రేటు 2.8 శాతం ఉండే అవకాశం ఉందని, ఇది గతంలో అంచనా వేసిన దానికంటే 0.5 శాతం తక్కువని పేర్కొంది. కాగా, ‘వికసిత్‌ భారత్‌ కోసం వికసిత్‌ రాజ్యం-2047’ పేరుతో నీతిఆయోగ్‌ రూపొందించిన పత్రంలో 2047 నాటికి భారత్‌ 30 ట్రిలియన్‌ డాలర్ల (రూ.25 కోట్ల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందని పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో.. సంపన్న దేశాలతో భారత్‌ సరితూగుతుందని తెలిపారు.


ఇవి కూడా చదవండి

Minister Satyakumar: 2047 నాటికి ప్ర‌పంచంలో రెండో స్థానానికి భార‌త్ ఎద‌గ‌డం ఖాయం

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్‌, దాని నీచమైన నిర్వాహకుడు పాక్‌.. నిప్పులు చెరిగిన అభిషేక్

India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 02:41 AM