ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మన అణ్వస్త్రాలు పెరుగుతున్నాయ్‌

ABN, Publish Date - Jun 17 , 2025 | 06:06 AM

భారత్‌ గతేడాది తన అణ్వస్త్రాలను స్వల్పంగా పెంచుకోవడంతోపాటు వినూత్న అణు సరఫరా వ్యవస్థల అభివృద్ధిని కొనసాగిస్తోంది. ప్రస్తుతం దాని వద్ద 172 అణ్వస్త్రాలు ఉన్నాయని..

  • ఈ ఏడాది 180కి చేరే అవకాశం

  • పాకిస్థాన్‌ వద్ద 170 వార్‌హెడ్లు

  • ఏడాదికి వంద సిద్ధం చేస్తున్న చైనా

  • స్టాక్‌హోం రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 16: భారత్‌ గతేడాది తన అణ్వస్త్రాలను స్వల్పంగా పెంచుకోవడంతోపాటు వినూత్న అణు సరఫరా వ్యవస్థల అభివృద్ధిని కొనసాగిస్తోంది. ప్రస్తుతం దాని వద్ద 172 అణ్వస్త్రాలు ఉన్నాయని.. ఈ ఏడాది వాటి సంఖ్య 180కి చేరుకుంటుందని స్టాక్‌హోం అంతర్జాతీయ శాంతి పరిశోధక సంస్థ (సిప్రీ) అంచనా వేసింది. ప్రపంచ దేశాలు మోహరించిన వార్‌హెడ్లు.. వాటి సైన్యాల అమ్ములపొదిలో ఎన్ని అణ్వస్త్రాలు ఉన్నాయో సోమవారం తన నివేదికలో తెలిపింది. భారత్‌ సరికొత్తగా కంటైనర్‌లలో ఉండే తర్వాతి తరం క్షిపణులను అభివృద్ధి చేస్తోందని.. వాటిలో సదరు క్షిపణులకు ముందే అణు వార్‌హెడ్లను మరింత సురక్షితంగా అమర్చే సౌకర్యం ఉంటుందని పేర్కొంది. ‘తర్వాతి తరం నూతన డెలివరీ ప్లాట్‌ఫాంలలో అగ్ని ప్రైమ్‌ (అగ్ని-పీ) క్షిపణి, మల్టీ ఇండిపెండెంట్‌లీ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికిల్‌ (ఎంఐఆర్‌వీ) సామర్థ్యం కల అగ్ని-5 క్షిపణి వ్యవస్థ ఉన్నాయి. అగ్ని సిరీస్‌ క్షిపణుల్లో అగ్ని-5 అత్యంత అధునాతనమైనది. దీని టార్గెట్‌ రేంజ్‌ వెయ్యి కిలోమీటర్ల నుంచి 2 వేల కిలోమీటర్లకు ఉంటుంది’ అని తెలిపింది.

మరోవైపు.. పాకిస్థాన్‌ కూడా ఈ ఏడాది తన అణు వార్‌హెడ్ల సంఖ్యను 170కి పెంచుకోవాలని నిర్ణయించిందని ‘సిప్రీ’ వెల్లడించింది.‘అణుసంబంధ మిలిటరీ మౌలిక వసతులపై దాడులకు మూడో వ్యక్తులిచ్చే తప్పుడు సమాచార వ్యాప్తి కూడా తోడైతే సంప్రదాయ యుద్ధం అణుసంక్షోభంగా మారుతుంది’ అని సిప్రీ సీనియర్‌ పరిశోధకుడు మ్యాట్‌ కోర్దా హెచ్చరించారు. చైనా అతివేగంగా అణు వార్‌హెడ్లను తయారుచేస్తోందని సిప్రీ తెలిపింది. అమెరికా, రష్యాలతో పోటీపడుతూ.. ఏడాదికి వంద చొప్పున సిద్ధం చేస్తోందని.. ఈ ఏడాది మరో వంద తయారీలో నిమగ్నమెందన్నది. గత జనవరికల్లా 350 ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను (ఐసీబీఎం) నిల్వచేసే భూగర్భ కేంద్రాలను పూర్తిచేసిందని పేర్కొంది. అమెరికా, రష్యా వద్ద ఉన్న అణు వార్‌హెడ్లలో మూడో వంతు మాత్రమే చైనా వద్ద ఉండటంతో 2035కల్లా 1,500 వార్‌హెడ్ల తయారీ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. గత జనవరికల్లా ప్రపంచ దేశాల వద్ద 12,241 వార్‌హెడ్లున్నాయని తెలిపింది. అయితే సిప్రీ నివేదికపై స్పందించేందుకు నిరాకరించిన చైనా.. ఏటా వంద వార్‌హెడ్లు తయారుచేస్తున్నా.. కని ష్ఠంగానే తన ఉత్పత్తి ఉందని పేర్కొది. అమెరికా, రష్యాలతో అణు రే సులో లేమని స్పష్టంచేసింది. తమ అణ్వస్త్ర కార్యక్రమం పూర్తిగా ఆత్మరక్షణకేనని చైనా విదేశాంగ ప్రతినిధి గువో జియాకున్‌ తెలిపారు.

Updated Date - Jun 17 , 2025 | 06:06 AM