ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Warheads: పాక్ కంటే భారత్‌లోనే ఎక్కువ వార్‌హెడ్‌లు

ABN, Publish Date - Jun 16 , 2025 | 08:18 PM

ఇండియా నెక్స్ట్ జనరేషన్ డెలివరీ ఫ్లాట్‌ఫాంలలో అగ్ని ప్రైమ్ (అగ్ని-పి) క్షిపణి, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్- కేపబుల్ అగ్ని-5 సిస్టమ్ వంటివి ఉన్నాయని 'సిప్రీ' తెలిపింది.

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ కంటే భారతదేశం వద్దే న్యూక్లియర్ వార్‌హెడ్‌లు (Nuclear Warheads) ఎక్కువగా ఉన్నాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIOPRI) సోమవారంనాడు విడుదల చేసిన న్యూ ఇయర్ బుక్‌లో తెలిపింది. గత ఏడాది భారత ఆయుధాగారంలో 172 న్యూక్లియర్ వార్‌హెడ్‌లు ఉండగా, 2025 నాటికి 180కి చేరినట్టు వెల్లడించింది. గత ఏడాది పాకిస్థాన్‌ వద్ద 170 న్యూక్లియర్ వెపన్స్ ఉండగా ప్రస్తుతం అంతే ఉన్నాయని తెలిపింది. అయితే చైనా ఆయుధాగారంలో గత ఏడాది 500గా ఉన్న న్యూక్లియర్ వార్‌హెడ్‌లు 2025 జనవరికి 600కు చేరినట్టు వివరించింది.

సిప్రి (ఎస్ఐపీఆర్ఐ) నివేదిక ప్రకారం, భారతదేశంలోని కొత్త 'క్యానిస్టరైజ్డ్' క్షిపణులను ముందుగానే అమర్చి, సురక్షితంగా ట్రాన్స్‌పోర్ట్ చేయవచ్చు. ఈ క్షిపణులు పీస్‌టైమ్‌లోనూ న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ను తీసుకెళ్లగలవు. ఈ నెక్స్ట్ జనరేషన్ సిస్టమ్‌ ద్వారా సమీప భవిష్యత్తులో ఒకే క్షిపణిలో అనేక వార్‌హెడ్‌లను తీసుకు వెళ్లే వీలుంది. 2024లో భారత్ తిరిగి న్యూక్లియర్ ఆయుధాగారాన్ని స్వల్పంగా విస్తరిస్తోందని, కొత్త తరహా న్యూక్లియర్ డెలివరీ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తోందని తెలిపింది.

ఇండియా నెక్స్ట్ జనరేషన్ డెలివరీ ఫ్లాట్‌ఫాంలలో అగ్ని ప్రైమ్ (అగ్ని-పి) క్షిపణి, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వీ)- కేపబుల్ అగ్ని-5 సిస్టమ్ వంటివి ఉన్నాయని 'సిప్రీ' తెలిపింది.

భోజనం నాణ్యతపై స్పైస్‌జెట్ పాసింజర్లు అగ్రహం.. సిబ్బందితో తినిపించిన వైనం

రాజా రఘువంశీ హత్యకు కొన్ని గంటల ముందు వీడియో.. షాకింగ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 08:27 PM