ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India GDP: జీ7 దేశాలకన్నా వేగంగా భారత్‌ ఆర్థిక వృద్ధి

ABN, Publish Date - Jun 24 , 2025 | 03:59 AM

భారత్‌ ఆర్థిక వృద్ధి వేగంగా దూసుకెళుతోంది. జీ7 దేశాలకన్నా మెరుగ్గా అభివృద్ధి సాధిస్తోంది. ఆ గణాంకాలను సంపద నిర్వహణ సంస్థ ఈక్విరస్‌ సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

  • ప్రపంచ జీడీపీ వృద్ధిలో 15 శాతం భాగస్వామ్య్డం.. ఈక్విరస్‌ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 23: భారత్‌ ఆర్థిక వృద్ధి వేగంగా దూసుకెళుతోంది. జీ7 దేశాలకన్నా మెరుగ్గా అభివృద్ధి సాధిస్తోంది. ఆ గణాంకాలను సంపద నిర్వహణ సంస్థ ఈక్విరస్‌ సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ‘‘చాలా జీ7 దేశాల కన్నా నిర్మాణాత్మకంగా భారత్‌ మంచి స్థానంలో ఉంది. ఇదొక అద్భుతమైన మార్పు. ఒకపక్క అమెరికా వృద్ధి రేటు పడిపోతోంది. అదే సమయంలో ప్రపంచ జీడీపీ వృద్ధి (2025-2030)లో భారత్‌ సహకారం 15 శాతానికి పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు’’ అని ఆ నివేదిక తెలిపింది. గ్రామీణ ఎఫ్‌ఎంసీజీ డిమాండ్‌ పట్టణ ప్రాంతాలను మించిపోయిందని చెప్పింది. విధాన ఆధారిత మూలధన వ్యయం 17.4 శాతం పెరిగిందని తెలిపింది. గ్లోబల్‌ జీడీపీ సహకారంలో జపాన్‌ (1 శాతం కన్నా తక్కువ), జర్మనీ (1.3 శాతం) కన్నా భారత్‌ ఎంతో మెరుగ్గా ఉంటుందని స్పష్టం చేసింది. తలసరి వ్యయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడా చాలా తగ్గిపోయిందని వెల్లడించింది.

Updated Date - Jun 24 , 2025 | 04:01 AM