ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tragic Incident: పెళ్లై నెల.. ఇంతలోనే ఊహించని విషాదం..

ABN, Publish Date - May 29 , 2025 | 09:50 PM

Tragic Incident: వికాష్ ఆమెను భుజంపై వేసుకుని ఆస్పత్రి వైపు పరుగులు తీశాడు. ఓ కిలోమీటర్ భార్యను మోసుకుని రోడ్డుపైకి తెచ్చాడు. రోడ్డుపై ఓ కారును ఆపి, అందులో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

Tragic Incident

మధ్య ప్రదేశ్‌లోని శివపురిలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన నెలకే ఓ యువతి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ట్రైన్‌లో వెళుతుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు విడిచింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... రాజస్థాన్, గ్వాలియర్‌కు చెందిన వికాష్ జోషికి.. ఉత్తరప్రదేశ్, జలౌన్‌లోని ఒరాయ్ ప్రాంతానికి చెందిన శివాణీ శర్మకు ఏప్రిల్ 16వ తేదీన పెళ్లయింది. శివాణీ ఎల్ఎల్బీ చదువుతోంది. ఎల్ఎల్బీ పరీక్షలు రాయడానికి తాజాగా గ్వాలియర్ నుంచి ఒరాయ్ బయలుదేరి వెళ్లారు.


వికాష్ ఇండోర్‌లో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒరాయ్‌లో శివాణి పరీక్షలు రాయటం అయిపోయిన తర్వాత మంగళవారం రాత్రి ఇద్దరూ కలిసి ఇండోర్ బయలుదేరారు. శివపురి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కారు. రాత్రి 9 గంటల సమయంలో శివాణి ఆరోగ్యం పాడైంది. వాంతులు చేసుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలోనే డోరు దగ్గరకు వెళ్లింది. డోరు దగ్గర కూర్చుని వాంతులు చేసుకుంటూ ఉంది. వికాష్ నీళ్లు తేవడానికి అక్కడినుంచి తమ సీట్ల దగ్గరకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత డోరు దగ్గరకు వచ్చాడు. అక్కడ శివాణీ లేదు. ఓ వ్యక్తి నిల్చుని ఉన్నాడు.


వికాష్ రాగానే ‘ ఇందాక ఇక్కడ కూర్చొన్న ఆమె కిందపడిపోయింది’ అని కంగారుగా చెప్పాడు. వికాష్ షాక్ అయ్యాడు. వెంటనే చైన్ లాగి రైలు దిగాడు. శివాణి పడిపోయిన చోటుకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. శివాణికి బాగా గాయాలు అయ్యాయి. వికాష్ ఆమెను భుజంపై వేసుకుని ఆస్పత్రి వైపు పరుగులు తీశాడు. ఓ కిలోమీటర్ భార్యను మోసుకుని రోడ్డుపైకి తెచ్చాడు. రోడ్డుపై ఓ కారును ఆపి, అందులో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. శివాణిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించారు. భార్య మరణంతో వికాష్ కుప్పకూలిపోయాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. తన భార్య చావుకు రైల్వే పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించాడు.


ఇవి కూడా చదవండి

జోధాతో అక్బర్ పెళ్లి జరగలేదు.. రాజస్థాన్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..

రోడ్డుపై బరితెగించిన ఆటో డ్రైవర్.. ప్రాణాలు తీసే స్టంట్.

Updated Date - May 29 , 2025 | 09:52 PM