ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Engineering Student: శారీరకంగా సుఖం కోసం అమ్మాయి వేధింపులు.. యువకుడు ఆత్మహత్య..

ABN, Publish Date - Jun 02 , 2025 | 12:34 PM

Engineering Student: అదే కాలేజీలో చదువుతున్న ఓ అమ్మాయి అతడిపై కన్నేసింది. శారీరకంగా కలవాలంటూ అతడిపై ఒత్తిడి తీసుకురాసాగింది. రోజు రోజుకు ఆమె ఒత్తిడి పెరగటంతో అతడు తట్టుకోలేకపోయాడు.

Engineering Student

జంబలకడి పంబ సినిమాలో చూపించినట్లు.. ఈ మధ్య కాలంలో మగాళ్లపై కూడా అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. శారీరక సుఖం కోసం మగాళ్లను వేధిస్తున్న ఆడవాళ్లు ఎక్కువైపోయారు. తాజాగా, యువతి వేధింపులు భరించలేక ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. శుక్రవారం రాత్రి కాలేజీ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సురేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు, మృతుడి తల్లి తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే..


20 ఏళ్ల ఓ యువకుడు హిమాచల్ ప్రదేశ్‌లోని సురేంద్ర నగర్‌లో ఉన్న జవహార్‌లాల్ నెహ్రూ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న ఓ అమ్మాయి అతడిపై కన్నేసింది. శారీరకంగా కలవాలంటూ అతడిపై ఒత్తిడి తీసుకురాసాగింది. రోజు రోజుకు ఆమె ఒత్తిడి పెరగటంతో అతడు తట్టుకోలేకపోయాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పుకుని ఏడ్చాడు. శుక్రవారం రాత్రి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయే ముందు ఓ సూసైడ్ నోట్ రాశాడు. తన చావుకు ఆ అమ్మాయే కారణం అని రాసుకొచ్చాడు.


శనివారం ఉదయం గది తలుపులు తెరిచి చూడగా.. అతడు విగతజీవిగా కనిపించాడు. కాలేజ్ యజమాన్యం పోలీసులకు ఈ సమాచారం అందించింది. సమాచారం అందుకున్న వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. సంఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడి చావుకు కారణం అని భావిస్తున్న అమ్మాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సాధారణ బదిలీల గడువు పొడిగింపు..

ఆధిపత్యం కోసం చైనా ఎత్తుగడ.. ఇండియాను ఒంటరిని చేసి..

Updated Date - Jun 02 , 2025 | 01:07 PM