ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Exit Polls: మూడోసారి కూడా 'సున్నా'నే.. కాంగ్రెస్‌కు మరో డిజాస్టర్

ABN, Publish Date - Feb 05 , 2025 | 09:47 PM

ఆరు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో 2 పోల్ సర్వేలు కాంగ్రెస్ పూర్తిగా 'ఖాళీ' అవుతుందని, జీరోకే పరిమితమవుతుందని అంచనా వేశాయి. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోకుండానే చేతులెత్తేసింది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ (Congress) పార్టీ మరోసారి గెలుపు ఖాతా తెరవకుండానే ఘోర పరాజయాన్ని చూడబోతోందా? అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తికాగానే వెలువడిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అవుననే చెబుతున్నాయి. అదే నిజమైతే కాంగ్రెస్ పార్టీ 'జీరో' స్థానంలో మిగిలిపోవడం వరుసగా ఇది మూడోసారి అవుతుంది. 6 ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో 2 పోల్ సర్వేలు కాంగ్రెస్ పూర్తిగా 'ఖాళీ' అవుతుందని, జీరోకే పరిమితమవుతుందని అంచనా వేశాయి. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోకుండానే చేతులెత్తేసింది.

Exit polls Resluts: ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలపై ఆప్, బీజేపీ స్పందనిదే..


ఢిల్లీలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోవడం 2015లో మొదలైంది. 70 స్థానాల్లో పోటీచేసి 70 స్థానాల్లోనూ పార్టీ ఓడిపోయింది. 2020లోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఒకప్పుడు షీలాదీక్షిత్ నాయకత్వంలో 15 ఏళ్లు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత వరుసగా రెండు సార్లు "జీరో'' స్థాయికి పడిపోయింది.


ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి?

మూడు ఎగ్జిట్ పోల్స్ బీజేపీ 27 తర్వాత అధికారంలోకి వస్తుందని అంచనా వేయగా, రెండు సర్వే సంస్థలు 'ఆప్' తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే ఈ అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని తేల్చాయి. రెండు సర్వే సంస్థలు మాత్రం కాంగ్రెస్ 1 నుంచి 2 సీట్లు గెలుచుకునే అవకాశాలు లేకపోలేదని 'ఫైనల్ టచ్' ఇచ్చాయి. మరి ఎవరి జోస్యం ఫలిస్తుందో చూడాలంటే ఎన్నికల ఫలితాలు వెలువడే ఫిబ్రవరి 8వ తేదీ వరకూ వేచిచూడాల్సిందే.


ఇవి కూడా చదవండి..

Delhi Exit Polls: కమల వికాసం...ఎగ్జిట్ పోల్స్ జోస్యం

Delhi Elections 2025 : అడుగడునా బారికేడ్లు..ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు.. ఢిల్లీ పోలీసులపై మంత్రి ఫైర్

Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. రాష్ట్రపతి నుంచి రాహుల్ వరకు ఓటేసిన ప్రముఖులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 09:50 PM