Haryana YouTuber: జ్యోతి పర్యటనలకు యూఏఈ సంస్థ స్పాన్సర్‌షిప్
ABN, Publish Date - May 23 , 2025 | 05:10 AM
గూఢచర్య ఆరోపణలపై అదుపులో ఉన్న హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు యూఏఈలోని వెగో అనే ట్రావెల్ ఏజెన్సీ స్పాన్సర్‌గా ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. వేగో సంస్థకు పాక్‌లో కార్యకలాపాల లైసెన్స్ ఉన్నప్పటికీ, నిధుల సమకూర్పుపై ఇప్పటివరకు ఎలాంటి నిబంధనలు కనిపించలేదు; దర్యాప్తు బృందాలు ఈ విషయంపై మరింత పరిశీలిస్తున్నాయి.
న్యూఢిల్లీ, మే 22: గూఢచర్యం ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్న హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు యూఏఈకి చెందిన ట్రావెల్ ఏజెన్సీ వెగో స్పాన్సర్ చేసిందని నిఘా వర్గాలు తెలిపాయి. అమె ట్రావెల్ వ్లాగ్‌ల కోసం పలు సంస్థల నుంచి స్పాన్సర్‌షి్‌పలు అందుకుంటున్నారు. జ్యోతి చేసిన చాలా వీడియోలకు వీగో స్పాన్సర్ చేసిందని అధికారులు గుర్తించారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) గుర్తింపు ఉన్న ఈ సంస్థకు సింగపూర్, దుబాయ్‌ల్లో కూడా కార్యాలయాలు ఉన్నాయి. పాక్‌లో కార్యకలాపాలు సాగించడానికి అవసరమైన ట్రావెల్ ఏజెన్సీ లైసెన్స్ దీనికి ఉంది. పాక్‌కు వెగో నిధులు సమకూరుస్తోందనడానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ, ఆ దేశంలో కార్యకలాపాలు సాగించడంతో పాటు జ్యోతి ప్రయాణ ఖర్చులకు స్పాన్సర్‌గా ఉండటంపై దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News
Updated Date - May 23 , 2025 | 05:10 AM