New York: న్యూయార్క్ సిటీ క్లబ్‌లో కాల్పులు
ABN, Publish Date - Aug 18 , 2025 | 04:13 AM
న్యూయార్క్ నగరంలోని ఓ క్లబ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
ముగ్గురి మృతి, 8 మందికి గాయాలు
న్యూయార్క్, ఆగస్టు 17: న్యూయార్క్ నగరంలోని ఓ క్లబ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున క్లబ్‌లో చెలరేగిన ఓ వివాదమే కాల్పులకు దారితీసినట్లు భావిస్తున్నామని న్యూయార్క్ కమిషనర్ జెస్సికా టిష్ వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి 36 షెల్ కేసింగ్‌లను, సమీపంలోని వీధిలో ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గాయపడిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని, వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇటీవలి కాలంలో నగరంలో తుపాకీ హింస రికార్డు స్థాయిలో తగ్గిందనుకుంటున్న నేపథ్యంలో.. తాజా కాల్పుల ఘటన భయానకమైనదని ఆమె పేర్కొన్నారు.
Updated Date - Aug 18 , 2025 | 04:13 AM