ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Highway Toll Policy: రూ.3 వేల టోల్‌ ఫీజు చెల్లిస్తే.. ఏడాదంతా హైవేలపై ప్రయాణం

ABN, Publish Date - May 26 , 2025 | 01:54 AM

హైవేలపై తరచూ ప్రయాణించే వాహనదారులకు కేంద్రం రూ.3 వేల వార్షిక రుసుముతో పరిమితుల్లేని ప్రయాణానికి కొత్త టోల్‌ పాలసీని తీసుకురానుంది. మరో ఆప్షన్‌గా రూ.50 చెల్లించి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించే విధానానికీ అవకాశం ఇవ్వనుంది.

కొత్త టోల్‌ పాలసీ తీసుకురానున్న కేంద్రం

న్యూఢిల్లీ, మే 25: సొంత వాహనాల్లో హైవేలపై తరచూ ప్రయాణాలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ఇవ్వబోతోంది. ప్రయాణంలో భాగంగా పదే పదే టోల్‌ ట్యాక్స్‌, ఫాస్టాగ్‌ రీచార్జి ఇబ్బందులు లేకుండా.. ఒకేసారి రూ.3 వేలు చెల్లిస్తే ఏడాదంతా ప్రయాణించేలా కొత్త టోల్‌ పాలసీని తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాలో రెండు చెల్లింపు విధానాలను ప్రతిపాదించనుంది. మొదటిది.. వాహన యజమాని రూ.3 వేల వార్షిక రుసుము చెల్లిస్తే ఏడాదిపాటు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రె్‌సవేలు, రాష్ట్ర ఎక్స్‌ప్రె్‌సవేలపై ఎటువంటి పరిమితులు లేకుండా ప్రయాణించవచ్చు. ఇక రెండోది.. రూ.50 చెల్లింపుతో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశం కల్పించడం. తక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ విధానం ప్రయోజనకరం కానుంది. ఇంతకుముందు రూ.30 వేలు చెల్లించి 15 ఏళ్లపాటు పరిమితులు లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టనుంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే హైవేలపై వాహనదారులు మరింత స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు.


ఇవి కూడా చదవండి

Minister Satyakumar: 2047 నాటికి ప్ర‌పంచంలో రెండో స్థానానికి భార‌త్ ఎద‌గ‌డం ఖాయం

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్‌, దాని నీచమైన నిర్వాహకుడు పాక్‌.. నిప్పులు చెరిగిన అభిషేక్

India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 01:54 AM