Toll Rates: బ్రిడ్జిలు, సొరంగాలున్న హైవేలపై టోల్ చార్జీలు సగానికి తగ్గింపు
ABN, Publish Date - Jul 05 , 2025 | 04:07 AM
జాతీయ రహదారులపై సొరంగాలు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ హైవేలు వంటి నిర్మాణాలున్న భాగాలకు టోల్ రేట్లను కేంద్ర ప్రభుత్వం 50శాతం వరకు తగ్గించింది.
న్యూఢిల్లీ, జూలై 4: జాతీయ రహదారులపై సొరంగాలు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ హైవేలు వంటి నిర్మాణాలున్న భాగాలకు టోల్ రేట్లను కేంద్ర ప్రభుత్వం 50శాతం వరకు తగ్గించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ టోల్ చార్జీలను లెక్కించడానికి కొత్త పద్ధతి/ఫార్ములాను నోటిఫై చేస్తూ ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. జాతీయ రహదారిపై ఉండే ప్రతి కిలో మీటరు వంతెనలు లేదా సొరంగాలకు వాహనదారులు సాధారణ టోల్ కన్నా పది రెట్లు ఎక్కువ చెల్లిస్తున్నారు. దీన్ని సవరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫ్లైఓవర్లు, అండర్‌పా్‌సలు, సొరంగాలున్న ప్రాంతాల్లో టోల్ రేటును 50 శాతం వరకు తగ్గించినట్టు ఓ అధికారి పేర్కొన్నారు.
Updated Date - Jul 05 , 2025 | 04:07 AM