ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Education Report: ప్రపంచంలో బడికెళ్లని పిల్లలు 27.2 కోట్లు

ABN, Publish Date - Jun 16 , 2025 | 05:49 AM

ప్రపంచవ్యాప్తంగా పాఠశాలకు వెళ్లని పిల్లల సంఖ్య ప్రస్తుతం దాదాపు 27.2 కోట్లుగా ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ టీమ్‌ (జీఈఎం) తాజా నివేదిక పేర్కొంది.

న్యూఢిల్లీ, జూన్‌ 15: ప్రపంచవ్యాప్తంగా పాఠశాలకు వెళ్లని పిల్లల సంఖ్య ప్రస్తుతం దాదాపు 27.2 కోట్లుగా ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ టీమ్‌ (జీఈఎం) తాజా నివేదిక పేర్కొంది. ఇది గత అంచనాల కంటే 2.1 కోట్లు ఎక్కువని తెలిపింది. ప్రాథమిక పాఠశాల వయస్సు పిల్లల్లో 11 శాతం మంది (7.8 కోట్లు), లోయర్‌ సెకండరీ స్కూల్‌ వయస్సు కౌమారదశ పిల్లల్లో 15 శాతం మంది (6.4 కోట్లు), అప్పర్‌ సెకండరీ స్కూల్‌ వయస్సు వాళ్లలో 31 శాతం మంది (13 కోట్లు) పాఠశాలకు దూరంగా ఉన్నారని వెల్లడించింది. పాఠశాలకు వెళ్లని పిల్లల పెరుగుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని పేర్కొంది. 80 లక్షల మంది (38 శాతం) పెరుగుదలకు కొత్త ఎన్‌రోల్‌మెంట్‌, అటెండెన్స్‌ డేటా లేకపోవడం కారణమని పేర్కొంది. 2021లో అఫ్గానిస్థాన్‌లో సెకండరీ విద్యలో చేరే విద్యార్థినులపై విధించిన నిషేధం కూడా ఇందుకు దోహదం చేసిందని వెల్లడించింది. మరోవైపు అప్‌డేట్‌ చేసిన యూఎన్‌ జనాభా అంచనాల కారణంగా మరో 1.3 కోట్ల మంది (మిగతా 62 శాతం) పెరిగారని, ఇది మరొక కారణమని తెలిపింది.

Updated Date - Jun 16 , 2025 | 05:51 AM