ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minors Driving: ట్రాక్టర్ నడిపేందుకు స్కూల్ ఎగ్గొట్టిన నలుగురు మైనర్లు.. బోల్తా పడి ముగ్గురు మృతి..

ABN, Publish Date - Feb 06 , 2025 | 03:52 PM

నలుగురు యువకుల సరదా కాస్తా, వారి ప్రాణం చేసింది. ఈ క్రమంలో యువకులు స్కూల్ ఎగ్గొట్టి ట్రాక్టర్ నడిపేందుకు వెళ్లారు. కానీ తిరిగి వచ్చే క్రమంలో ట్రాక్టర్ పల్టీ కొట్టి, ముగ్గురు మృతి చెందగా, ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

Four Minors Driving Tractor Chhattisgarh Dhamtari

నలుగురు మైనర్లు స్కూల్ ఎగ్గొట్టి చేసిన పనికి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆ క్రమంలో ట్రాక్టర్ నడిపేందుకు యువకులు బయటకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ధమ్‌తారి జిల్లా కురుద్ సమీపంలో చోటుచేసుకుంది.


ఈ ప్రమాదంలో..

ఈ దుర్ఘటన ధమ్‌తారి జిల్లా కురుద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్రా గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు ఈ ప్రమాదం గురించి గురువారం సమాచారం అందించారు. ఆ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా 16 ఏళ్ల ప్రీతమ్ చంద్రకర్ ఉన్నారని, మయాంక్ ధ్రువ్, హోనేంద్ర సాహు, గాయపడ్డ బాలుడు అర్జున్ యాదవ్ ఈ ప్రమాదంలో భాగస్వాములయ్యారని తెలిపారు. మృతులలో 16 ఏళ్ల ప్రీతమ్ చంద్రకర్, 16 ఏళ్ల మయాంక్ ధ్రువ్, 14 ఏళ్ల హోనేంద్ర సాహు చర్రా గ్రామానికి చెందినవారు. గాయపడిన బాలుడు అర్జున్ యాదవ్ బనగర్ గ్రామానికి చెందిన వారని పేర్కొన్నారు.


స్థానికుల విచారం..

ఈ నలుగురు బాలురు గురువారం స్కూలుకు వెళ్లకుండా ట్రాక్టర్ నడిపేందుకు వెళ్లిన క్రమంలో ప్రమాదం జరిగింది. సమాచారం ప్రకారం ప్రీతమ్ చంద్రకర్ తన ఇంటి వద్ద ఉన్న ట్రాక్టర్‌ను తీసుకుని మిగతా ముగ్గురు బాలుళ్లతో కలిసి కురుద్ గ్రామానికి వెళ్లారు. ఆ క్రమంలో తిరిగి వస్తున్నప్పుడు ట్రాక్టర్ నడిపిస్తున్న ప్రీతమ్ చంద్రకర్ ట్రాక్టర్‌పై నియంత్రణ కోల్పోయాడు.

ఆ క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి, ముగ్గురు బాలురు క్రింద చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. గాయపడిన అర్జున్ యాదవ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం పట్ల స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 06 , 2025 | 03:54 PM