ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maha Kumbh: మహాకుంభ్‌లో మళ్లీ మంటలు

ABN, Publish Date - Jan 20 , 2025 | 06:34 PM

సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కిన్నర్ అఖారా క్యాంప్‌ నుంచి పొగలు రావడంతో అన్న క్షేత్ర ఫైర్ స్టేషన్ వద్దనున్న సిబ్బంది వెంటనే గమనించి కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు.

ప్రయాగ్‌రాజ్: మహాకుంభ్‌ మేళా (Mahakumbh Mela)లో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ 16లోని కిన్నర్ అఖారా క్యాంపులో సోమవారంనాడు మంటలు చెలరేగాయి. అయితే వెంటనే ఆ మంటలను ఆర్పివేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనికి ముందు రోజే ఆదివారంనాడు మహాకుంభ్‌మేళాలోని సెక్టార్‌ 19లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పలు సిలెండర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి 18 టెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు.

PM Modi: భిన్నత్వంలో ఏకత్వానికి కుంభమేళా ప్రతీక


కాగా, సోమవారం మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కిన్నర్ అఖారా క్యాంప్‌ నుంచి పొగలు రావడంతో అన్న క్షేత్ర ఫైర్ స్టేషన్ వద్దనున్న సిబ్బంది వెంటనే గమనించి కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక శకటాలలతో పాటు పెట్రోలింగ్ సిబ్బంది క్షణాల్లో అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడున్న కొందరు నీళ్లు, ఇసుక చల్లి మంటలను ఆర్పేశారు. శ్రీ హరి దివ్య సాధనా పీఠ్ క్యాంపు‌ వద్ద ఒక చిన్న టెంట్ మంటల్లో చిక్కుకుందని, అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

RG Kar Case: ఆర్జీకర్ దోషికి జీవిత ఖైదుపై మమత రియాక్షన్

Rahul Gandhi: పేదల హక్కుల కోసం ‘వైట్‌ టీషర్ట్‌’ ఉద్యమం

Saif Ali Khan: సైఫ్‌పై దాడి చేసింది బంగ్లాదేశీయుడు!

Read Latest National News and Telugu News

Updated Date - Jan 20 , 2025 | 06:34 PM