Share News

PM Modi: భిన్నత్వంలో ఏకత్వానికి కుంభమేళా ప్రతీక

ABN , Publish Date - Jan 20 , 2025 | 05:10 AM

ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన మహా కుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi: భిన్నత్వంలో ఏకత్వానికి కుంభమేళా ప్రతీక

ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది

‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన మహా కుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని ప్రధాని మోదీ అన్నారు. సమానత్వం, సామరస్యాల అసాధారణ సంగమమైన ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిందని చెప్పారు. ప్రపంచ దేశాల ప్రజలు ఇక్కడకు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. ప్రతినెలా చివరి ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని ప్రసంగిస్తారు. అయితే, ఈసారి నాలుగో ఆదివారం గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో మూడో ఆదివారమే ఆయన ఈ కార్యక్రమం 118వ ఎపిసోడ్‌లో ప్రసంగించారు. వేల ఏళ్లుగా కొనసాగుతున్న కుంభమేళాలో ఎక్కడా ధనిక, పేద తారతమ్యఽం, కులాల పేరుతో వివక్షకు తావులేదని చెప్పారు. ఇటువంటి కుంభమేళాలు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఒకేలా ఉన్నాయన్నారు. ప్రయాగ్‌రాజ్‌, ఉజ్జయిని, నాసిక్‌. హరిద్వార్‌లో కుంభమేళాలు నిర్వహిస్తుంటే, మరోవైపు దక్షిణాదిలో గోదావరి, కృష్ణా, నర్మద, కావేరి నదులకు పుష్కరాలు నిర్వహిస్తారని గుర్తుచేశారు.

Updated Date - Jan 20 , 2025 | 05:10 AM