ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fake IAS: ఐఏఎస్ అని చెప్పుకుంటూ దర్జాగా కారులో షికార్లు.. పోలీసులకు చిక్కిన నిందితుడు

ABN, Publish Date - Jun 30 , 2025 | 07:17 PM

ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటూ ముంబై‌లోని కస్టమ్స్ శాఖ గెస్ట్ హౌస్‌లో మకాం వేసిన ఓ బీహార్ వ్యక్తిని స్థానిక పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

Fake IAS Officer Mumbai

ఇంటర్నెట్ డెస్క్: హోం శాఖలో కీలక అధికారినని చెబుతూ పోజు.. కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ గెస్ట్ హౌస్‌లో మకాం.. ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న కారులో దర్జాగా షికార్లతో హడావుడి చేసిన ఫేక్ ఐఏఎస్ అధికారిని మహారాష్ట్ర పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అతడు ఫేక్ అన్న సమాచారం తెలియగానే రంగంలోకి దిగి మోసానికి ఫుల్ స్టాప్ పెట్టారు. నిందితుడు చంద్రమోహన్ ప్రసాద్ రంబాలీ సింగ్ అని, అతడి స్వస్థలం బీహార్ అని గుర్తించారు.

అధికారులు తెలిపిన దాని ప్రకారం, ఐఏఎస్‌లా నటించి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న సింగ్ జూన్ 28న రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతడికి తొలుత బాండ్రా ఈస్ట్‌లోని కస్టమ్స్ శాఖ గెస్ట్‌ హౌస్‌లో మకాం ఏర్పాటు చేసేందుకు ఓ ప్రభుత్వ ఉద్యోగి సహకరించినట్టు తెలిసింది. రెండు రోజులుగా అతడు గెస్ట్ హౌస్‌లో ఉంటున్నాడు. అయితే, జూన్ 28 మధ్యాహ్నం 1 గంటకు పాట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ బాలాసాహెబ్ రౌత్, కానిస్టేబుల్‌ లక్ష్మణ్ బాగావేకు నిందితుడి గురించి సమాచారం అందింది.

స్విఫ్ట్ డిజైర్ కారులో నిందితుడు తనని తాను ఐఏఎస్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని తెలిసింది. దీంతో, పోలీసులు మలాడ్‌లోని ఓక్ స్ట్రీట్ హోటల్ వద్ద అతడిని అడ్డగించారు. పోలీసులు ఎదురుగా నిలబడ్డా కూడా నిందితుడు భయపడలేదు. కారు వెనక సీటులో దర్జాగా కూర్చుని, తన ఐడీ కార్డు చూపిస్తూ తాను హోం శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌నని చెప్పుకున్నాడు. కానీ ఐడీ కార్డును చూడగానే అది ఫేక్ అని పోలీసులకు డౌట్ వచ్చింది. పొంతన లేని అతడి సమాధానాలు విన్నాక అనుమానం బలపడింది. చివరకు అతడి బండారం మొత్తం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కోసం దహిసార్ క్రైమ్ బ్రాంచ్‌కు తీసుకెళ్లారు.

విచారణ సందర్భంగా సింగ్‌కు తను చేసిన నేరం ఒప్పుకోక తప్పలేదు. 2017లో తాను ఐఏఎస్ ప్రిపరేషన్ ప్రారంభించినట్టు తెలిపాడు. తనతో పాటు పరీక్షకు సిద్ధమైన కొందరు స్నేహితులు ఐఏఎస్, ఐఆర్‌ఎస్‌కు ఎంపికయినా తనకు మాత్రం సాధ్యం కాలేదని తెలిపాడు. కుటుంబసభ్యులు, బంధువుల ఒత్తిడి కూడా పెరిగిందని చెప్పాడు. ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో మకాంపై కూడా వివరణ ఇచ్చుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన స్నేహితుడి సాయంతో గెస్ట్ హౌస్‌లో మకాం బుక్ చేసుకున్నట్టు తెలిపాడు. ఇక అతడి వద్ద ఉన్న వివిధ రకాల ఐడీ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసాల మూలాలు కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

అగ్ని-5 బంకర్ బస్టర్ మిసైల్ అభివృద్ధికి నడుం కట్టిన డీఆర్‌డీఓ

మహిళలకు తృటిలో తప్పిన ముప్పు.. జలపాతంలో నీరు ఒక్కసారిగా ఉప్పొంగడంతో..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 30 , 2025 | 07:39 PM