ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Duplicate voter cards: డూప్లికేట్ ఓటర్ కార్డ్ సమస్య పరిష్కారం.. ఎన్నికల సంఘం వెల్లడి

ABN, Publish Date - May 14 , 2025 | 03:34 PM

డూప్లికేట్ ఓట‌ర్ ఐడెంటిటీ కార్డు నెంబ‌ర్ల స‌మ‌స్య‌కు చెక్ పెట్టినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ రోజు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 2005 నుంచి ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల్లో ఓటర్ కార్డుల కోసం ఓవ‌ర్‌లాపింగ్ ఆల్ఫాన్యూమ‌రిక్ సిరీస్‌ను వాడుతోంది.

Duplicate voter card number

ఓట‌రు ఐడీ నెంబ‌ర్లకు చెందిన 20 ఏళ్ల నాటి స‌మ‌స్య‌ను పరిష్కరించినట్టు ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించింది. డూప్లికేట్ ఓట‌ర్ ఐడెంటిటీ కార్డు నెంబ‌ర్ల స‌మ‌స్య‌కు చెక్ పెట్టినట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ రోజు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 2005 నుంచి ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల్లో ఓటర్ కార్డుల కోసం ఓవ‌ర్‌లాపింగ్ ఆల్ఫాన్యూమ‌రిక్ సిరీస్‌ను వాడుతోంది. దీంతో డూప్లికేట్ ఓటర్ ఐడీ నెంబర్ల సమస్య మొదలైంది (Duplicate voter card number).


డూప్లికేట్ ఓటర్ ఐడీ నెంబర్ల సమస్య గురించి భారీ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈసీ ఆ సమస్యపై ఫోకస్ పెట్టింది. ఏకంగా 99 కోట్ల ఓట‌ర్ల ఐడీ కార్డుల‌ను వెరిఫికేష‌న్ చేసింది. 36 రాష్ట్రాల్లో 4,123 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10.50 లక్షల పోలింగ్ స్టేషన్స్‌లో వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టింది. వీటిల్లో చాలా త‌క్కువ సంఖ్య‌లోనే డూప్లికేట్ ఓట‌ర్ ఐడీ కేసులు ఉన్న‌ట్లు గుర్తించింది. అలాంటి ఓట‌ర్ల‌కు కొత్త, విశిష్ట‌మైన ఎపిక్ నెంబ‌ర్ల‌తో కూడిన ఐడీలు జారీ చేసిన‌ట్లు ఎన్నిక‌ల సంఘం తెలిపింది.

Updated Date - May 14 , 2025 | 03:34 PM