ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Earthquake: పలు దేశాల్లో కంపిస్తోన్న భూమాత.. క్షణ క్షణం.. భయం భయం

ABN, Publish Date - Apr 05 , 2025 | 07:32 AM

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపాలు నమోదవుతున్నాయి. నిన్నటి నుంచి మొదలైన భూకంపనాలు జరుగుతున్నాయి. జపాన్ లో గత 24 గంటల్లో 4సార్లు భూమి కంపించగా, తాజాగా ఈ ఉదయం ఇరాన్ లో ప్రకంపనలు సంభవించాయి.

Earthquake

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపాలు నమోదవుతున్నాయి. నిన్నటి నుంచి మొదలైన భూకంపనలు ఈ ఉదయం కూడా జరుగుతున్నాయి. జపాన్ లో గత 24 గంటల్లో 4సార్లు భూమి కంపించగా, తాజాగా ఈ ఉదయం పలు దేశాల్లో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. అ ఉత్తర భారతంలోనూ భూ ప్రకంపనలు రికార్డవుతున్నాయి. అటు, నేపాల్‌ను శుక్రవారం సాయంత్రం స్వల్ప భూకంపం వణికించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.0 గా నమోదైంది. గర్ఖాకోట్‌కు మూడు కి.మీ దూరంలో 20కి.మీ లోతులో భూకంప కేంద్రం రికార్డయ్యింది. ఈ ప్రభావంతో ఉత్తర భారతంలోనూ పలు ప్రాంతాల్లో కొన్ని సెకండ్లపాటు భూమి కంపించింది.

ఇక, నేపాల్‌లో శుక్రవారం సాయంత్రం గం. 7.52 సమయంలో ప్రకంపనలు రికార్డయినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. ఆ సమయంలో ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు.. పపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.9గా నమోదు అయింది. పశ్చిమ న్యూ బ్రిటన్‌ ప్రావిన్స్‌లోని కింబే పట్టణానికి 194 కి.మీ దూరంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. 10 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీచేశారు.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 07:45 AM